ప్రధాన మంత్రి కార్యాలయం
జనాభా లెక్కల సమాచార పత్రాన్ని స్వయంగా పూర్తి చేసిన ప్రధానమంత్రి
సొంత కుటుంబ వివరాలను నమోదు కోసం అందరూ జనగణన ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలను కోరిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 8:12PM by PIB Hyderabad
గృహాల జాబితా, గృహ గణనతో కూడిన 'జనగణన 2027' మొదటి దశ ప్రారంభానికి సూచికగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సమాచార పత్రాన్ని పూర్తి చేశారు. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో డేటా సేకరణ జరుగుతున్న జనగణన ఇదేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలు కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా ఉన్న ఈ విధానం భారతీయులకు సాధికారతను కల్పిస్తుందని ఆయన తెలిపారు.
దేశ ప్రజలంతా కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని.. తద్వారా జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“గృహాల జాబితా, గృహ గణనకు సంబంధించిన 'జనగణన 2027' మొదటి దశ ఈ రోజు ప్రారంభమవుతోంది. తొలిసారిగా డిజిటల్ మాధ్యమాల ద్వారా డేటా సేకరణ జరుగుతున్న జనగణన ఇదే. ఇది భారతీయులు కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా వారికి సాధికారతను కల్పిస్తుంది.
కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకొని ఈ జనగణన ప్రక్రియలో పాల్గొనాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.”
***
(రిలీజ్ ఐడి: 2248103)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada