ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నెదర్లాండ్స్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 9:34PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు  నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో మాట్లాడారు. “భారత-నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై మేం చర్చించాంముఖ్యంగా సెమీకండక్టర్లుభారీ నీటి ప్రాజెక్టులుగ్రీన్ హైడ్రోజన్నిపుణుల పరస్పర పర్యటనలు వంటి రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్య అవకాశాల గురించి ప్రస్తావించాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారుపశ్చిమాసియా ప్రాంతంలో శాంతిసుస్థిరతలను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో మాట్లాడటం సంతోషంగా ఉందిభారత-నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై మేం చర్చించాంసెమీకండక్టర్లుభారీ నీటి ప్రాజెక్టులుగ్రీన్ హైడ్రోజన్నిపుణుల పర్యటనల వంటి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను గుర్తించాంపశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులపై కూడా అభిప్రాయాలను పంచుకున్నాంఆ ప్రాంతంలో శాంతిసుస్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాం” అని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి పేర్కొన్నారు

 

***


(రిలీజ్ ఐడి: 2247158) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati