ప్రధాన మంత్రి కార్యాలయం
సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాన మంత్రి..
శ్యామ్‌జీ కృష్ణ వర్మ జీవితం అందరికీ సాహస స్ఫూర్తిని అందిస్తోందన్న ప్రధాని
प्रविष्टि तिथि:
30 MAR 2026 9:52AM by PIB Hyderabad
స్వాతంత్య్ర యోధుల్లో మహనీయుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ జీవితం మనకు ధైర్య సాహసాలతో పాటు దృఢ సంకల్పానికి సంబంధించిన అసాధారణ స్ఫూర్తిని అందిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇది దేశం పట్ల పౌరులు తమ కర్తవ్యాలను నెరవేర్చాలన్న భావనను కూడా అంకురింప చేస్తోంద’’ని శ్రీ మోదీ అన్నారు.
ఈ సందర్భంగా ఒక సంస్కృత శ్లోకాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు. అది ఇలా ఉంది..:
‘‘విచిత్రచరితోల్లేఖచమత్కారితచేతనమ్
ప్రాప్యతే కిం యశ: శుభ్రమనంగీకృత్య సాహసమ్.’’
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘స్వాతంత్య్ర యోధులలో మహనీయుడైన శ్యామ్‌జీ కృష్ణ వర్మ జీవితం మనకు సాహసం, దృఢ సంకల్పాల అద్భుత ప్రేరణను అందిస్తోంది. ఇది దేశం పట్ల తమ కర్తవ్యాలను నిర్వహించాలనే భావనను ప్రజలలో అంకురింప చేస్తోంది.
విచిత్రచరితోల్లేఖచమత్కారితచేతనమ్
ప్రాప్యతే కిం యశ: శుభ్రమనంగీకృత్య సాహసమ్’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2246785)
आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam