ప్రధాన మంత్రి కార్యాలయం
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభోత్సవంలో చేసిన ప్రసంగ దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 MAR 2026 7:41PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఇది గర్వించదగిన సమయమని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వికసిత యూపీ, వికసిత భారత్ అభియాన్‌లో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైందని, భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా మారిందని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో చేసిన వరస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనంలో అత్యాధునిక సౌకర్యాలను చూసి మనసుకి ఎంతో సంతృప్తి కలిగింది. ఈ విమానాశ్రయం ద్వారా అనుసంధానం, పెట్టుబడులు, అభివృద్ధికి కొత్త వేగం అందుతుంది."
"నేడు ప్రారంభమైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి, మా పని సంస్కృతికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రపంచ యుద్ధ సంక్షోభాల మధ్య కూడా భారత్ నిరంతరం ముందుకు సాగుతోందని ఇది చాటిచెబుతోంది."
"మా ప్రభుత్వం ఇటీవలే ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించింది. దీని కింద రాబోయే ఏళ్లలో చిన్న చిన్న నగరాల్లో 100 కొత్త విమానాశ్రయాలు, 200 కొత్త హెలీప్యాడ్‌లు నిర్మించాలని ప్రణాళిక వేసింది. దీని వల్ల యూపీకి కూడా చాలా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది."
"మా ప్రభుత్వం విమానాల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాలింగ్, సదుపాయాలను భారీ స్థాయిలో భారత్‌లోనే అభివృద్ధి చేసే పనిలో ఉంది. దీని వల్ల దేశానికి ఆదాయం వస్తుంది. యువతకు అనేక ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి."
"వికసిత భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు మా ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాలపై మునుపెన్నడూ లేని విధంగా పెట్టుబడులు పెడుతోంది. మెట్రో, వందే భారత్ వంటి రైళ్లు, ఓడరేవుల సామర్థ్యం విస్తరణ దీనికి నిదర్శనం."
“పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల తలెత్తిన ప్రస్తుత ప్రపంచ సంక్షోభాన్ని మనం పూర్తి ఓపికతో, ఐక్యతతో ఎదుర్కోవాలి. దీనిపై అన్ని రాజకీయ పార్టీలకు నా విన్నపం ఇదే..”
***
(రిలీజ్ ఐడి: 2246609)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Kannada