హోం మంత్రిత్వ శాఖ
ఇంధనంపై ఎక్సయిజ్ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు
పశ్చిమ ఆసియా సంక్షోభం నడుమ.. ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో సతమతమవుతూ అంతటా ధరలు పెరుగుతుంటే,
ఇంధనంపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయంతో పౌరులకు ఎంతో ఊరట
చాలా దేశాలు డీజిలు, పెట్రోలు ధరలను పెంచగా ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం..
ప్రభుత్వ ప్రజాకేంద్రిత పాలననీ, సమస్యల్ని అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడాన్నీ ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2026 1:30PM by PIB Hyderabad
ఇంధనంపై విధిస్తున్న ఎక్సయిజ్ సుంకంలో కోత పెట్టాలని నిర్ణయించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ-
‘‘పశ్చిమ ఆసియాల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో సతమతం అవుతూ సర్వత్రా ధరలు పెంచుతుంటే, ఇంధనంపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం పౌరులకు గొప్ప ఉపశమనాన్నిచ్చింది. డీజిలు, పెట్రోలు ధరలను అనేక దేశాలు పెంచితే, ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిస్తూ ఈ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తోందనీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గమనిస్తూ తదనుగుణమైన నిర్ణయాల్ని తీసుకుంటోందనీ స్పష్టం చేస్తోంది. ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని నేను ప్రశంసిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2246047)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada