మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ (ఐవీఎఫ్ఆర్‌టీ) పథకానికి క్యాబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 4:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇమ్మిగ్రేషన్వీసాఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ (ఐవీఎఫ్ఆర్‌టీపథకాన్ని 2026 మార్చి 31 తర్వాత కూడా కొనసాగించేందుకు ఆమోదించారు. 2026 ఏప్రిల్ నుంచి 2031 మార్చి 31 వరకు అయిదేళ్ల కాలానికి రూ.1800 కోట్ల బడ్జెట్ అంచనాతో దీనికి ఆమోద ముద్ర వేశారు.

భారత దేశానికి విదేశీయుల వలసవీసా జారీరిజిష్ట్రేషన్‌కు సంబంధించిన కార్యకలాపాలను ఐవీఎఫ్‌ఆర్‌టీ వేదిక అనుసంధానించిమెరుగ్గా నిర్వహిస్తుందిసురక్షితమైనఏకీకృతమైన సేవలను అందించే వ్యవస్థ ద్వారా ఇమిగ్రేషన్వీసా సేవలను ఆధునికీకరించడంమెరుగుపరచడమే ఐవీఎఫ్ఆర్‌టీ ప్రధాన లక్ష్యంజాతీయ భద్రతను బలోపేతం చేస్తూనేచట్టబద్ధమైన ప్రయాణీకులకు సౌలభ్యాన్ని అందించడమే ధ్యేయంగా నిర్దేశించుకుంది. 13.05.2010న రూ.1011 కోట్ల బడ్జెట్ అంచనాతో 2014 సెప్టెంబరు వరకు కొనసాగేలా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2015లో ఈ ప్రాజెక్టు బడ్జెట్‌ను రూ.638.90 కోట్లకు సవరిస్తూ.. 2017 మార్చి 31 వరకు పొడిగించారుఆ తర్వాత ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా 2021 మార్చి 31 వరకు మరోసారి పొడిగించారుసవరించిన బడ్జెట్ రూ.638.90 కోట్లలో రూ.613.28 కోట్లు ఖర్చు చేశారురూ.1365 కోట్ల బడ్జెట్‌ అంచనాతో అయిదేళ్ల కాల పరిమితితో 01.04.2021 నుంచి 31.03.2026 వరకు కొనసాగించేందుకు 19.01.2022న క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం ద్వారా ఐవీఎఫ్ఆర్‌టీ పథకం విస్తృతినిసామర్థ్యాన్ని పెంపొందిస్తుందిఅంతే కాకుండాభద్రతా వ్యవస్థ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలతో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందిమారుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్లను నెరవేర్చడానికికొత్తగా తలెత్తుతున్న జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి ఐవీఎఫ్‌ఆర్‌టీ ప్రాజెక్టు ఆధునికీకరణ అవసరంఇటీవలే ఇమిగ్రేషన్ఫారినర్స్ చట్టం - 2025, దాని అనుబంధ నియమాలుఉత్తర్వులు అమల్లోకి వచ్చిన అనంతరం ఐవీఎఫ్ఆర్‌టీ వ్యవస్థను బలోపేతం చేయాల్సినఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడిందితద్వారా అక్రమ వలసలతో సహావలసల నియంత్రణవిదేశీయుల  నిర్వహణలో ప్రస్తుత అవసరాలనుభవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చుసాంకేతిక మెరుగుదలకు మాత్రమే ఈ ప్రాజెక్టు కొనసాగింపు పరిమితం కాలేదుఇది ప్రపంచ స్థాయి ఇమిగ్రేషన్వీసా జారీ వ్యవస్థ ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా చేపట్టిన వ్యూహాత్మక మార్పుఈ ప్రాజెక్టు తదుపరి దశలో మూడు విస్తృత అంశాలపై దృష్టి సారిస్తుంది. (అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు, (బిప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి (సిసాంకేతిక పరిజ్ఞానంసేవల మెరుగుదల.

ఆటంకాలు లేనిసురక్షితమైన ప్రయాణానికి మొబైల్ ఆధారిత సేవలుసెల్ఫ్ సర్వీసు కియోస్కులతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం ద్వారా ఇమిగ్రేషన్వీసా వ్యవస్థను ఈ పథకం ఆధునికీకరిస్తుందిఇది దేశవ్యాప్తంగా పటిష్టమైనవిస్తరించదగిన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇమిగ్రేషన్ పోస్టులుఎఫ్ఆర్‌ఆర్‌వోలుడేటా సెంటర్లలో ప్రాథమిక మౌలిక వసతులను మెరుగుపరచివిస్తరిస్తుందిసామర్థ్యాన్నివినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏకీకృత డిజిటల్ వేదికలను ప్రారంభించడంప్రధాన అప్లికేషన్ నిర్మాణాన్ని పునరుద్ధరించడంనెట్‌వర్క్విస్తరణ విధానాలను బలోపేతం చేయడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్నిసేవల పంపిణీని మెరుగుపరుస్తుందిఫలితంగా జాతీయ భద్రతను బలోపేతం చేస్తూనే చట్టబద్ధమైన ప్రయాణికులకు సౌలభ్యాన్ని అందిస్తుందిఈ పథకం సేవలను కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో విదేశ పర్యాటకులను ఆకర్షించేలా సాంకేతిక ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి తోడ్పడుతుందిఅలాగేపర్యాటకంవైద్యంవ్యాపార రంగాలకు ఊతమిస్తుందిఅంతర్జాతీయంగా రాకపోకలనువ్యాపారాన్నివాణిజ్యాన్నిపర్యాటకాన్ని పెంపొందించడానికి అవసరమైన అనేక సానుకూల అంశాలను ఐవీఎఫ్‌ఆర్‌టీ కలిగి ఉందిఇది ఆర్థిక వృద్ధికిఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది.

దేశవ్యాప్తంగా 117 ఇమిగ్రేషన్ పోస్టులు (జేపీలు), 15 మంది విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ అధికారులు (ఎఫ్ఆర్ఆర్ఓలు), 854 ఫారినర్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఎఫ్ఆర్‌వోలు)/పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు)/డిప్యూటీ పోలీసు కమిషనర్లు దీని పరిధిలోకి వస్తారు.

ఇమిగ్రేషన్వీసా కార్యకలాపాల్లో సేవల పంపిణీనికార్యనిర్వాహక సామర్థ్యాన్ని ఐవీఎఫ్‌ఆర్‌టీ వ్యవస్థ గణనీయమైన మెరుగుపరిచిందిఆన్‌లైన్ అపాయింట్మెంట్ షెడ్యూలింగ్చెల్లింపుల ద్వారా 100 శాతం కాంటాక్ట్‌లెస్ఫేస్‌లెస్ వీసా ప్రక్రియలను ఈ వ్యవస్థ సుసాధ్యం చేసిందిఫలితంగా గత అయిదేళ్లలో ఈ-వీసాల అప్లికేషన్లలో 91.24 శాతం 72 గంటల లోపే ఆమోదం పొందాయిబయోమెట్రిక్స్‌తో సహా ఇమిగ్రేషన్ పోస్టుల వద్ద సగటు ప్రయాణీకుల క్లియరెన్స్ సమయం 5-6 నిమిషాల నుంచి 2.5-3 నిమిషాలకు తగ్గింది.

ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్-ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీఐ-టీటీపీద్వారా 13 ప్రధాన విమానాశ్రయాల్లో ఆటోమేటెడ్ ఈ-గేట్లను ఏర్పాటు చేశారుదీనివల్ల ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సమయం 2.5-3 నిమిషాల నుంచి 30 సెకన్లకు తగ్గిందిప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ భారతీయ పౌరులకుఓసీఐ కార్డుదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది.

వ్యాపార సౌలభ్యంసౌకర్యంభద్రతా హామీలను అందించడం ద్వారా ఐవీఎఫ్‌ఆర్‌టీ వ్యవస్థ గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోందిపర్యాటకంవ్యాపారంవాణిజ్యంపరిశ్రమసేవారంగాలుప్రత్యేకించి విమానయానంఆతిథ్యం రంగాలు ఐవీఎఫ్‌ఆర్‌టీ వ్యవస్థ ద్వారా విస్తృత స్థాయిలో లబ్ధిని పొందుతాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2245339) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Kannada