ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణపై నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2026 9:05AM by PIB Hyderabad

ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికీ, అమూల్యమైన జల వనరును అత్యంత బాధ్యతాయుతంగా వినియోగించుకోవడానికీ ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

జీవాన్ని నిలపడంలోనూ, ఈ భూమి భవితను తీర్చిదిద్దడంలోనూ నీటి పాత్ర అత్యంత కీలకమైందని చెబుతూ.. సుస్థిర పద్ధతులను అనుసరిస్తున్న వారినీ, అవగాహనను పెంపొందిస్తున్న వారినీ, జల సంరక్షణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న వారినీ శ్రీ మోదీ అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘నీరు మన జీవనాధారం, ఈ భూగోళం భవిష్యత్తును నిలిపేదీ అదే.

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి నీటిబొట్టునూ కాపాడుకునేందుకూ, నీటిని బాధ్యతాయుతంగా వినియోగించుకూ కట్టుబడి ఉంటామని మరోసారి సంకల్పిద్దాం. సుస్థిర పద్ధతులను అనుసరిస్తున్నవారినీ, అవగాహనను పెంపొందిస్తున్నవారినీ, జల సంరక్షణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నవారినీ అభినందించాల్సిన రోజిది.’’  


(రిలీజ్ ఐడి: 2243575) సందర్శకుల సూచీ సంఖ్య : : 91