ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చంద్రఘంటా అమ్మవారి దివ్యమైన, కరుణామయమైన అనుగ్రహాన్ని కోరుతూ.. సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2026 8:05AM by PIB Hyderabad

చంద్రఘంటా అమ్మవారి దివ్యమైన, శుభప్రదమైన అనుగ్రహాన్ని కీర్తిస్తూ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

చంద్రఘంటా అమ్మవారి పాద పద్మాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నమస్కారాలు సమర్పించారు. శక్తి, శాంతికి ప్రతీక అయిన ఆ జగన్మాత, తన అనంతమైన ఆశీస్సులను భక్తులందరిపై ఎల్లప్పుడూ కురిపించాలని ఆయన ప్రార్థించారు. ప్రతి వ్యక్తికీ సుసంసన్నమైన, సౌభాగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవి అనుగ్రహాన్ని కోరుకుంటున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు. 

‘‘మాతా చంద్రఘంటకు ప్రణామాలు!. ప్రతి ఒక్కరికీ శక్తిమంతమైన, సుసంపన్నమైన, సౌభాగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను. 

 

‘‘పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా॥’’

 

సింహవాహనంపై విరాజిల్లుతూ, శక్తిమంతమైన ఆయుధాలను ధరించిన చంద్రఘంట మాత మనందరిపై తన కృపాకటాక్షాలను కురిపించి, మనల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.


(రిలీజ్ ఐడి: 2243335) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Kannada