రైల్వే మంత్రిత్వ శాఖ
నిర్ణయాత్మక భద్రతా చర్యలు చేపట్టిన భారతీయ రైల్వేలు: తగ్గిన ప్రమాదాలు, మరణాలు
దశాబ్ద కాలంలో రైలు ప్రమాదాల్లో 60 శాతం, మరణాల్లో 17 శాతం తగ్గుదల
2024-25లో 31 నుంచి 2025-26లో (ఫిబ్రవరి వరకు) 14కు తగ్గిన ప్రమాదాలు
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 2:18PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలు భద్రతకు అత్యున్నత ప్రాదాన్యాన్నిస్తాయి. అనేక ఏళ్లుగా తీసుకున్న వివిధ భద్రతా చర్యల కారణంగా ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
దిగువ పట్టికలో పేర్కొన్న విధంగా రైలు ప్రమాదాల సంఖ్య తగ్గింది:
|
సంవత్సరం
|
ప్రమాదాల సంఖ్య
|
|
2014-15
|
135
|
|
2025-26 (28.02.2026 వరకు)
|
14 (90 శాతం తగ్గుదల)
|
భారతీయ రైల్వేల్లో జరిగిన రైలు ప్రమాదాలు, మరణాలు (రైలు ప్రయాణికులు, రైల్వే సిబ్బందితో సహా) దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:
|
కాలవ్యవధి
|
జరిగిన ప్రమాదాల సంఖ్య
|
మరణించిన వారి సంఖ్య
|
గాయపడిన వారి సంఖ్య
|
|
2004-05 నుంచి 2013-14
|
1,711
|
904
|
3,155
|
|
2014-15 నుంచి 2023-24
|
678
|
748
|
2,087
|
|
2024-25
|
31
|
18
|
92
|
|
2025-26 (2026 ఫిబ్రవరి వరకు)
|
14
|
16
|
28
|
ట్రాకుల నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థలతో సహా సురక్షితమైన రైలు కార్యకలాపాల కోసం చేపట్టిన వివిధ చర్యలు దిగువన పేర్కొన్న విధంగా ఉన్నాయి:
· గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేల్లో భద్రతా సంబంధిత కార్యకలాపాలపై చేసిన వ్యయం దిగువ చూపిన విధంగా పెరిగింది:
|
భద్రతా సంబంధిత కార్యకలాపాలపై చేసిన వ్యయం/బడ్జెట్ (రూ. కోట్లలో)
|
|
2013-14
|
2022-23
|
2023-24
|
2024-25
|
2025-26
|
2026-27
|
|
39,200
|
87,336
|
1,01,662
|
1,14,022
|
1,17,693
|
1,20,389
|
· మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి 28.02.2026 నాటికి 6,665 స్టేషన్లలో పాయింట్లు, సిగ్నళ్ల కేంద్రీకృత నిర్వహణతో కూడిన ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
· లెవెల్ క్రాసింగ్ (ఎల్‌సీ) గేట్ల వద్ద భద్రతను పెంపొందించడానికి 28.02.2026 నాటికి 10,153 లెవెల్ క్రాసింగ్ గేట్లకు ఇంటర్ లాకింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
· ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ట్రాక్ ఆక్యుపెన్సీని ధ్రువీకరించి భద్రతను బలోపేతం చేయడానికి 28.02.2026 నాటికి 6,669 స్టేషన్లలో ట్రాక్ సర్క్యూటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
· స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థను భారతీయ రైల్వేలు అమలు చేస్తున్నాయి. దీనికి అత్యున్నత స్థాయి భద్రతా ధ్రువీకరణ (ఎస్‌ఐఎల్ 4) అవసరం. 2020 జులైలో జాతీయ ఏటీపీ వ్యవస్థగా కవచ్‌ను స్వీకరించారు. దక్షిణ మధ్య రైల్వేలో 1,465 ఆర్కేఎంలపై ఏర్పాటు చేసిన కవచ్ 3.2 అనుభవాలతో దానిని మరింత మెరుగుపరిచారు. చివరిగా, 16.07.2024న కవచ్ 4.0ను ఆర్డీఎస్‌వో ఆమోదించింది. విస్తృతమైన పరీక్షల అనంతరం 1,452 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ 4.0ను విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-హౌరా లాంటి రద్దీగా ఉండే మార్గాల్లో సైతం దిగువ చూపిన విధంగా ఏర్పాటు చేశారు
|
క్రమ సంఖ్య
|
విభాగం
|
పురోగతి సాధించిన మార్గం (కేఎం)
|
|
(1)
|
ఢిల్లీ-ముంబయి మార్గం:
|
|
I
|
జంక్షన్ క్యాబిన్-పల్వాల్-మధుర-నగ్డా విభాగం
|
667
|
|
Ii
|
వడోదర-అహ్మదాబాద్ విభాగం
|
96
|
|
Iii
|
వడోదర-విరా విభాగం
|
336
|
|
(2)
|
ఢిల్లీ-హౌరా మార్గం:
|
|
I
|
గయ సర్మాతన్ర విభాగం
|
93
|
|
Ii
|
ఛోటా అంబానా-బర్ధమాన్-హౌరా విభాగం
|
260
|
ఈ సమాచారాన్ని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా అందించారు.
(రిలీజ్ ఐడి: 2242664)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9