కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరు ప్రధాన నగరాల్లో ‘24 స్పీడ్ పోస్టు’ సేవలు: మరుసటి రోజే డెలివరీ పూర్తి చేయనున్న తపాలా విభాగం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 11:51AM by PIB Hyderabad

తపాలా విభాగం ‘24 స్పీడ్ పోస్ట్’ సేవలను 2026 మార్చి 17న ప్రారంభిస్తుంది. ఈ సేవలను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లోని ఆకాశవాణి భవన్లో ఉన్న రంగభవన్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 12:30 గంటలకు తపాలా విభాగం ఉన్నతాధికారుల సమక్షంలో జరుగుతుంది.

అత్యవసరమైన, నిర్ణీత సమయంలో పంపించాల్సిన పార్శిళ్లను తరువాతి రోజే 24 స్పీడ్ పోస్టు సేవలు డెలివరీ చేస్తాయి. మొదటి దశలో ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక విండోలు, వైమానిక రవాణాకు ప్రాధాన్యవమివ్వడం ద్వారా నిర్దేశిత డీ+1, డీ+2 సమయంలోగా 24, 48 స్పీడ్ పోస్టు సేవలు పూర్తవుతాయి. ఓటీపీ ఆధారిత డెలివరీ, డెలివరీ పూర్తయ్యేంత వరకు ఎస్ఎంఎస్ అలర్టులు, వ్యాపారుల కోసం బీఎన్‌పీఎల్ సౌకర్యం, బల్క్ బుకింగులకు ఉచిత పికప్, ఏపీఐ ఏకీకరణ, కేంద్రీకృత బిల్లింగులు ఈ సేవల్లో భాగంగా ఉన్నాయి. వీటితో పాటుగా సేవల్లో జాప్యం జరిగితే డబ్బును తిరిగి చెల్లించే హామీ కూడా ఉంది. ఇవి భారతీయ తపాలా ప్రీమియం ఎక్ర్‌ప్రెస్ డెలివరీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి.

 

***

 

(రిలీజ్ ఐడి: 2240679) సందర్శకుల సూచీ సంఖ్య : : 116
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Kannada