సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కాపీరైట్ రక్షణకు చర్యలు.. ఉల్లంఘనల కోసం డిజిటల్ వేదికలపై ప్రసార భారతి నిరంతర పర్యవేక్షణ
దూరదర్శన్‌లో సామాజిక సంబంధిత, సాంస్కృతిక సమాచారాన్ని ప్రోత్సహించడానికి ‘క్రియేటర్స్ కార్నర్’
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 4:37PM by PIB Hyderabad
ప్రసార భారతి స్వయంగా రూపొందించిన లేదా సిద్ధం చేయించిన కంటెంట్‌పై పూర్తి కాపీరైట్ హక్కులను కలిగి ఉంటుంది. మీడియా ప్రొడక్షన్ సంస్థల ద్వారా కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి ఇటీవల ఎటువంటి కేసులు నమోదవ్వలేదు. అయితే సోషల్ మీడియా వంటి మధ్యంతర వేదికల్లో వ్యక్తిగత వినియోగదారులు చేసే కాపీరైట్ ఉల్లంఘనలను ప్రసార భారతి నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రొడక్షన్ పనులను ఇతరులకు సబ్-కాంట్రాక్టుకు ఇచ్చిన సందర్భాలేవీ ప్రసార భారతి దృష్టికి రాలేదు. ముందు జాగ్రత్తగా ప్రొడక్షన్ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల్లోనే సబ్-కాంట్రాక్టును పరిమితం చేసే నిబంధనలను చేర్చింది.
దూరదర్శన్ కింద ప్రారంభించిన ‘క్రియేటర్స్ కార్నర్’ కార్యక్రమం ద్వారా కంటెంట్ క్రియేటర్లను ప్రజా ప్రసార సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా సామాజికంగా ఉపయోగపడే అంశాలను, దేశ సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలను ప్రతిబింబించే కంటెంట్‌ను మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని ప్రధాన ఉద్దేశం. ‘‘క్రియేటర్స్ కార్నర్’’కింద ఎంపిక కావాలంటే కంటెంట్ నాణ్యత బాగుండాలి. ప్రసార భారతి ప్రోగ్రామ్, అడ్వర్టైజింగ్ కోడ్‌లతో పాటు అన్ని చట్టాలకు అనుగుణంగా ఉండాలి. కంటెంట్ సృష్టికర్తలకు కనీసం ఒక ప్రధాన సోషల్ మీడియా వేదికలపై తగినంత ఫాలోయింగ్ ఉండాలి. ఎంపికైన కంటెంట్‌కు నిడివి ఆధారంగా ప్రసార భారతి నిర్ణయించిన రేట్ల ప్రకారం పారితోషికం చెల్లిస్తారు.
ఈ సమాచారాన్ని రాజ్యసభలో శ్రీ శ్రీ తిరుచ్చి శివ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2240049)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16