ప్రధాన మంత్రి కార్యాలయం
చిలీ అధ్యక్షుడు శ్రీ జోస్ ఆంటోనియో కాస్ట్ రిస్ట్ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
13 MAR 2026 12:54PM by PIB Hyderabad
చిలీ అధ్యక్షునిగా శ్రీ జోస్ ఎంటోనియో కాస్ట్ రిస్ట్ పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, చిలీల మధ్య ఆత్మీయ, మైత్రీసంబంధాల్ని మరింత బలపరచడంతో పాటు వాణిజ్యం, సాంకేతిక విజ్ఞానం, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని తాను ఎదురుచూస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘చిలీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన శ్రీ జోస్ ఆంటోనియో కాస్ట్ రిస్ట్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు. భారత్, చిలీల మధ్య ఆత్మీయ, మైత్రీ సంబంధాల్ని మరింత బలపరిచడంతో పాటు వాణిజ్యం, సాంకేతిక విజ్ఞానం, ఇంధన రంగాల్లో సహకారాన్ని గాఢతరంగా మలిచే దిశగా కూడా ఆయనతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను. ఆయన పదవీకాలం ఫలప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2239670)
आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam