ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నెక్స్‌ట్ శిఖరాగ్ర సదస్సులో తన ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 13 MAR 2026 12:58PM by PIB Hyderabad

ఐటీవీ నెట్‌వర్క్‌ నిర్వహించిన నెక్స్‌ట్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఇచ్చిన ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్నారుభారత్ స్వాతంత్య్ర పోరాటానికీఅభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న దేశ ప్రస్తుత లక్ష్యానికీ మధ్య పోలిక ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానిస్తూ… 1930లో నిర్వహించిన యాత్ర స్వతంత్రాన్ని సాధించడం కోసం దేశ ప్రజలను ఏకతాటి మీదికి తీసుకువచ్చిందనీఅదే విధంగా ప్రస్తుత ‘‘వికసిత్ భారత్’’ ఉద్యమం 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి లక్ష్యంగా మారిందన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ కొన్ని సందేశాలను పొందుపరుస్తూ -

‘‘ఒకప్పుడు ఏదైనా పనిని అసాధ్యమని భావిస్తేఇప్పుడు భారత్ ఆ పనిని చేసి చూపిస్తోంది’’.

‘‘ప్రస్తుతం సాగుతున్న యుద్ధం ప్రపంచానికి సంకటంగా మారింది.. దీనిని ఎదుర్కోవడంలో భారత్ ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలిపెట్టడం లేదు’’.

‘‘గడచిన పదేళ్లలో మా ప్రభుత్వం చేసిన కృషి వల్ల మావోయిస్టుల బెడద అంతరించిపోయే స్థితికి చేరిందిదీంతోఒకప్పుడు భయం గుప్పిట్లో బతక్క తప్పని ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలు సరికొత్త జోరుతో అమలవుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2239668) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada