ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళంలోని ఎర్నాకుళంలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ, జాతికి అంకితం చేసిన కార్యక్రమాల ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 8:51PM by PIB Hyderabad

 

కేరళం అభివృద్ధి వేగవంతం లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శక్తిమంతమైన తీరప్రాంత నగరం కొచ్చిలో పర్యటించారు. దాదాపు రూ.11,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, కొచ్చికి రావడం ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నారు. "ఈ ప్రాజెక్టుల కోసం కేరళం ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు.

‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టులలో కొన్ని ముఖ్య విషయాలను పంచుకుంటూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఈ రోజు సముద్రపు నాచు ఉత్పత్తిలో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. మా ప్రభుత్వమూ దీనిని ప్రోత్సహిస్తోంది.

మేం చేపల పెంపకంలో ఆధునిక వ్యవస్థలనూ ప్రోత్సహిస్తున్నాం."

"మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది మా ప్రభుత్వమే. దీని వల్ల కేరళంకు గణనీయ ప్రయోజనం కలిగింది. ఈ రంగంలో ఎఫ్‌పీవోలూ అభివృద్ధి చెందడాన్ని చూడటం చాలా బాగుంది."

"అఖిల కేరళ ధీవర సభ సమాజంలో సామాజిక సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించడంలో గణనీయ కృషి చేసింది."

"కొచ్చి రిఫైనరీలోని పాలీప్రొఫైలిన్ యూనిట్ స్వయం సమృద్ధి దిశగా మా ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది. ప్యాకేజింగ్, వస్త్రాలు, ఆటోమొబైల్స్, వైద్య పరికరాల వంటి అనేక రంగాలకు మద్దతునిస్తోంది."
 

"కేరళంలో కనెక్టివిటీకి ప్రోత్సాహం!"


(రిలీజ్ ఐడి: 2238676) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Malayalam