పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా గగనతల పరిస్థితి - ఈ రోజు 50 విమానాలను నడిపేందుకు సిద్ధమైన భారతీయ వైమానిక సంస్థలు

నాడు పోస్టు చేయడమైనది: 09 MAR 2026 12:08AM by PIB Hyderabad

భారత్పశ్చిమాసియా మధ్య విమానయానాన్ని ప్రభావితం చేస్తున్న పశ్చిమాసియాలో పరిస్థితులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందిప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులకు భద్రతక్రమబద్ధమైన విమాన ప్రయాణాన్ని అందించేందుకు అవసరమైన కార్యాచరణ సర్దుబాట్లను విమానయాన సంస్థలు చేపడుతున్నాయి.

ఈ ప్రాంతం నుంచి 8,175 మంది 51 విమానాల ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు 2026 మార్చి నాటి ప్రయాణికుల సమాచారం తెలియజేస్తోంది.

దుబాయ్అబుదాబీరస్ అల్ ఖైమాఫుజైరామస్కట్జెడ్డా తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల నుంచి 2026 మార్చి 8న భారతీయ విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ఇండిగోస్పైస్‌జెట్ఆకాశ 49 విమానాలను నడిపాయి.

ప్రస్తుత పరిస్థితి ఆధారంగా 2026 మార్చి 9న 50 విమానాలను నడిపేందుకు భారతీయ విమానయాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ ప్రాంతంలోని ఇతర విమానాశ్రయాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని భారతీయ వైమానిక సంస్థలు నిరంతరం అంచనా వేస్తున్నాయిదీనివల్ల ఆ ప్రదేశాల నుంచి మరిన్ని విమానాలను భారతీయ విమానయాన సంస్థలు నడిపేందుకు వీలుంటుంది.

ఎయిర్‌లైన్స్సంబంధిత ఇతర సంస్థలతో మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేస్తోందిఈ సమయంలో విమానయాన ఛార్జీలు సహేతుకంగా ఉండేలాఅసంబద్ధంగా ధరలను పెంచకుండా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.

ఫ్లైట్ షెడ్యూళ్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారుమంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందిఅవసరాన్ని బట్టి తాజా సమాచారాన్ని అందిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2236878) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam