ప్రధాన మంత్రి కార్యాలయం
మార్చి 9వ తేదీన ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’ అనే అంశంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 MAR 2026 4:35PM by PIB Hyderabad
2026 మార్చి 9న ఉదయం 10:15 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం’ ఇతివృత్తంపై నిర్వహించే బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
ఈ ఇతివృత్తం కింద విద్య- నైపుణ్యం, ఆరోగ్యం - ఆయుష్, పర్యాటకం - ఆతిథ్యం వంటి వివిధ రంగాలలో బహుళ బ్రేకౌట్ సెషన్లు నిర్వహించనున్నారు. విద్య నుంచి ఉపాధికి మార్గాలను బలోపేతం చేయడం, యానిమేషన్ - విజువల్ ఎఫెక్ట్స్ - గేమింగ్ - కామిక్స్ (ఏజీవీసీ) కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల అభివృద్ధి, అనుబంధ ఆరోగ్య నిపుణులు, సంరక్షుకల శిక్షణ విస్తరణ వంటి అంశాలపై ఈ చర్చలు కొనసాగుతాయి. వీటితో పాటు ప్రాంతీయ వైద్య కేంద్రాలు, కొత్త ఆయుష్ సంస్థల ఏర్పాటుతో పాటు ఆతిథ్య నైపుణ్యాభివృద్ధి, సుస్థిర పర్యాటక మార్గాలు, ఈశాన్య ప్రాంతంలో బౌద్ధ సర్క్యూట్లు, వారసత్వ పర్యాటక ప్రచారం వంటి పర్యాటక కార్యక్రమాలపై కూడా సమగ్రంగా చర్చించనున్నారు.
బడ్జెట్‌లో పొందుపరిచిన విధానపరమైన దార్శనికతను ఆచరణాత్మక వ్యూహాలుగా మార్చడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, సంబంధిత రంగాల నిపుణులకు ఈ వెబినార్ ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది. ఈ చర్చల ద్వారా వెలువడే ఆచరణాత్మక సిఫార్సులు.. బడ్జెట్ అమలును సులభతరం చేయడమే కాకుండా సమగ్ర వృద్ధి, అభివృద్ధి దిశగా దేశ పురోగతిని వేగవంతం చేయడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2236649)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam