జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

కొన్ని నెలలుగా థాయ్‌లాండ్‌లో చిత్రహింసలకు గురవుతున్న ఆరుగురు భారత కార్మికులను ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వచ్ఛంద జోక్యంతో రక్షించిన ఎంఈఏ


ఫిబ్రవరి 20, 2026న ఎంఈఏకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమాచారమిచ్చిన మరుసటి రోజే స్వదేశానికి చెేరుకున్న నలుగురు

కార్మికుల భారత ప్రయాణ ఖర్చులను భరించిన యజమాని

మిగతా ఇద్దరి వీసా గడువు ముగిసిన కారణంగా థాయ్‌లాండ్‌లో చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నారని, వారిని స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించిన ఎంఈఏ

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 11:29AM by PIB Hyderabad

థాయ్‌లాండ్‌లో ఆరునెలలుగా యజమాని చెరలో హింసకు గురవుతున్న ఆరుగురు భారతీయ కార్మికుల విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీస్వచ్ఛందంగా తీసుకున్న చర్యల ఫలితంగా కేంద్ర విదేశీ వ‌్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏస్పందించివారిని రక్షించిందిఫిబ్రవరి 20, 2026న ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమాచారం అందించిన వెంటనే ఎంఈఏ తక్షణ చర్యలు చేపట్టిందిదీంతో మరుసటి రోజే నలుగురు భారత్‌కు తిరిగి వచ్చారుయజమాని టికెట్లు బుక్ చేసిన విమానంలో వారు బ్యాంకాంక్ నుంచి కోల్‌కతా చేరుకున్నారు.

ఎంఈఏ రక్షించిన మిగతా ఇద్దరి కార్మికుల వీసా గడువు ముగియటంతో తిరిగి స్వదేశానికి రప్పించే అంశంపై థాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ దక్షిణ విభాగం వెల్లడించింది.

మీడియా నివేదికను పరిగణనలోకి తీసుకున్న కమిషన్బందీలుగా ఉన్న ఆరుగురు కార్మికులకు ఏదైనా సహాయం అందించాలని ఫిబ్రవరి 20, 2026న ఎంఈఏను కోరిందిఎన్‌హెచ్‌ఆర్‌సీ నుంచి సమాచారం అందిన వెంటనే స్పందించిన ఎంఈఏ దక్షిణ విభాగంథాయ్ అధికారులకు అభ్యర్థన పంపిందిఆరుగురు కార్మికులు పనిచేస్తున్న కంపెనీ యజమానిని కూడా సంప్రదించింది.

ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన కార్మికులువారి దీనస్థితిని వివరిస్తూ చేసిన వీడియో గురించి ఫిబ్రవరి 17, 2026న మీడియాలో వార్తలొచ్చాయిబ్యాంకాక్ సమీపంలోని ఫ్యాక్టరీలో యజమాని తమను బందీలుగా ఉంచి శారీరకంగామానసికంగా హింసకు గురిచేస్తున్నట్లు కార్మికులు పేర్కొన్నారువేతనంసరైన ఆహారం లేకుండా ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో రోజుకు 12 గంటలు పని చేయించుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారువారి పాస్‌పోర్టులను కూడా యజమాని లాక్కున్నట్లు తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2236624) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Odia , Tamil