సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“ సబ్కా సాథ్, సబ్కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం; విద్య, నైపుణ్యాలు, యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు” అనే అంశంపై మార్చి 9న బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి


భారత్ లో విద్య, నైపుణ్యాలు, ఏవీజీసీ - ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థను
బలోపేతం చేసే కేంద్ర బడ్జెట్ 2026–27 ప్రతిపాదనలపై వెబినార్ చర్చ.

నాడు పోస్టు చేయడమైనది: 06 MAR 2026 6:47PM by PIB Hyderabad

కేంద్ర బడ్జెట్ 2026–27లో ప్రకటించిన కీలక కార్యక్రమాలపై చర్చించేందుకు ఉన్నత విద్యా శాఖతో కలిసి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ)  “సబ్కా సాథ్, సబ్కా వికాస్ - ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం: విద్య, నైపుణ్యాలు, యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు” అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో పాల్గొంటుంది. భారతదేశ విద్య, నైపుణ్యాలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే అమలు మార్గాలపై చర్చించేందుకు ఈ వెబినార్ విధాన నిర్ణేతలు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు, విద్యార్థులను ఒక వేదికపై చేరుస్తుంది.

మార్చి 9న ఉదయం 11:30 గంటలకు గౌరవ ప్రధానమంత్రి వెబినార్ ప్రారంభ సమావేశంలో పాల్గొంటారు. వృద్ధి, ఉద్యోగాలు, సాఫ్ట్ పవర్‌ను పెంపొందించేలా సృజనాత్మకత, సంస్కృతి, సాంకేతికత కలిసే ఏవీజీసీ – క్రియేటర్ ఎకానమీ బడ్జెట్ లక్ష్యాలను వివరిస్తూ ఆయన ప్రత్యేక ప్రసంగం చేస్తారు.

మధ్యాహ్నం 12:20 నుంచి  01:50 వరకు ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్‌పై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక సెషన్ 

వెబినార్‌లో భాగంగా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ “పాఠశాలలు, కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమంలో 15,000 పాఠశాలలు, 500 ఉన్నత విద్యా సంస్థల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ (సీసీఎల్) ఏర్పాటుపై కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనను అమలు చేయడంపై  దృష్టి సారిస్తుంది. సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడం, భారత యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) వ్యవస్థను బలోపేతం చేయడం, దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆరెంజ్ ఎకానమీ కోసం నైపుణ్యం కలిగిన ఆవిష్కర్తలను సిద్ధం చేయడం దీని ప్రధాన లక్ష్యం.

మధ్యాహ్నం 12:20 నుంచి న 01:50 వరకు జరిగే “పాఠశాలలు, కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్” ప్రత్యేక సెషన్‌కు విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు, సీటీఓ శ్రీ చైతన్య చింక్లికర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ప్రధాన ప్రసంగం చేస్తారు.

ఈ సెషన్‌లో భాగంగా ప్రభుత్వ, పరిశ్రమ నిపుణులతో ప్యానెల్ చర్చ జరుగుతుంది. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ శ్రీ ధీరజ్ సాహు, ఫిక్కీ ఏవీజీసీ ఫోరమ్ ఛైర్మన్ డాక్టర్ ఆశిష్ కులకర్ణి, జెట్‌సింథసిస్ వ్యవస్థాపకుడు,  గ్రూప్ సీఈఓ  శ్రీ రాజన్ నవాని, వైగర్ సీఈఓ సోనమ్ భగత్‌తో పాటు ఐఐసీటీ నుంచి  ఒక విద్యార్థి ప్రతినిధి పాల్గొంటారు. ఈ చర్చలో శ్రీ ముంజాల్ ష్రాఫ్ (గ్రాఫిటీ మల్టీమీడియా), శ్రీ బిరెన్ ఘోష్ (టెక్నికలర్ గ్రూప్), శ్రీ మన్వేంద్ర శుకుల్ (లక్ష్య డిజిటల్), శ్రీమతి మాలా శర్మ (అడోబ్ ఇండియా), శ్రీమతి ప్రీతి వ్యాస్ (అమర్ చిత్ర కథ)తో పాటు మైభారత్‌కు చెందిన ఇద్దరు యువ వాలంటీర్లు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

సాయంత్రం 4:30 నుంచి  5:45 వరకు ముగింపు సమావేశం

వెబినార్ వివరాలను ముగింపు సమావేశంలో సంక్షిప్తంగా వివరిస్తారు. సాయంత్రం 05:25 గంటలకు గౌరవ సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు.

ఆహ్వానం - వెబ్‌కాస్ట్

విద్యా సంస్థలు, పరిశ్రమల సంఘాలు, స్టార్టప్‌లు, క్రియేటర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు,  ఏవీజీసీ రంగ నిపుణులు ఈ వెబినార్‌లో చేరి చర్చల్లో పాల్గొనవలసిందిగా కోరారు. 

ఈ వెబినార్‌ను ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు:

యూట్యూబ్ లైవ్: https://youtube.com/live/seASZfw_G1Y?feature=share

ఈ వెబినార్ ద్వారా యువ భారతీయులకు సృజనాత్మక, డిజిటల్ నైపుణ్యాలను అందించడం,  ఏవీజీసీ రంగంలో భారత్ ను ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడం లక్ష్యంగా ఉన్న 'ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్' అమలుకు అవసరమైన కార్యాచరణ, భాగస్వామ్య వ్యూహాలు వెలువడుతాయని భావిస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2236236) సందర్శకుల సూచీ సంఖ్య : : 109
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Tamil , Kannada , Assamese , English , Urdu , हिन्दी , Gujarati