సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తమిళ పండితులు, వారసత్వం, సంస్కృతిపై 16 ప్రచురణలను విడుదల చేసిన ఉప రాష్ట్రపతి


"అనేక భాషల నిలయం భారత్.. కానీ ఆత్మ ఒక్కటే": ఉప రాష్ట్రపతి

గొప్పదైన, కాలాతీత తమిళ నాగరికత ప్రాధాన్యతపై అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యలు

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 8:48PM by PIB Hyderabad

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిన 16 ముఖ్యమైన పుస్తకాలను ఇవాళ ఉప రాష్ట్రపతి భవన్‌లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ ప్రచురణలు ప్రసిద్ధ తమిళ పండితులు, వారసత్వం, వాస్తుశిల్పం, సాహిత్యం, సంస్కృతికి సంబంధించినవి. ఇవాళ విడుదలైన వాటిల్లో 13 ప్రచురణలు తమిళ భాషకు సంబంధించినవి కావటం విశేషం.

తమిళ శీర్షికల్లో రామేశ్వరం, రామానుజర్, నడుకల్, అరికైమేడు, భక్తి ఇలక్కియం, ఇయర్కై వెలన్మై, పజాంతమిజాన్ ఇసై కరువిగల్, తమిజగ నత్తర్ దైవంగళ్, పుధియ అరివియల్ తొజిల్నుత్పంగళ్, బంకించంద్ర ఛటర్జీ, మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, తంజావూర్ పెరువుడయార్ కోయిల్, మణిమేగలై, మహావిద్వాన్ మీనాక్షి సుందరం పిళ్లై ఉన్నాయి.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఇవాళ విడుదలైన ప్రచురణలు ఆలయ సంప్రదాయాలు, తత్వశాస్త్రం, సాహిత్యం, సంగీతం, విజ్ఞాన శాస్త్రం వంటి అంశాలతో గొప్పదైన తమిళ వారసత్వాన్ని, వైవిధ్యాన్ని, నాగరికత కొనసాగింపును ప్రతిబింబిస్తాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన శాస్త్రీయ భాషల్లో ఒకటిగా తమిళ భాషను అభివర్ణించారు. అనేక భాషలకు భారత్ నిలయమైనప్పటికీ, దాని ఆత్మ ఒక్కటే అని స్పష్టం చేశారు. తమిళ భాషకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా గౌరవం కల్పిస్తున్నారని ప్రశంసించారు. ఆర్థిక పురోగతితో పాటు సాంస్కృతిక బలం కూడా ముఖ్యమన్నారు. యువత, రోజూ కనీసం ఒక గంట సమయాన్ని పుస్తకాలు చదవటానికి కేటాయించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ సందర్భాన్ని అత్యంత చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, సుసంపన్నమైన, ప్రాచీన సంస్కృతి గల తమిళ భాషను విశిష్టమైన శాస్త్రీయ భాషగా కొనియాడారు. పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురణలు గొప్ప వారసత్వాన్ని ఘనంగా చాటిచెబుతున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్.మురుగన్ పాల్గొని మాట్లాడారు. తమిళ సంగమ సాహిత్య ప్రాముఖ్యతను, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా బంకించంద్ర చటర్జీపై ఎస్.కె. బోస్.. ఆంగ్లం, హిందీ, తమిళ భాషల్లో రాసిన పుస్తకావిష్కరణ నిలిచింది. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సమగ్ర ఎడిషన్, ఆ మహోన్నత సాహిత్యవేత్త జీవిత విశేషాలను, సమకాలీన పరిస్థితులను, భారతీయ సాహిత్య ఉద్యమానికి ఆయన అందించిన అసమానమైన కృషిని వివరిస్తుంది. పునః ముద్రించిన ఆంగ్ల ప్రచురణ సరికొత్తగా రూపొందించిన కవర్ పేజీతో పాటు, మరిన్ని అదనపు ప్రాచీన ఛాయాచిత్రాలు, చిత్ర పటాలతో వస్తుంది. ఐఐటీ ఢిల్లీ సహకారం గల అంకుర సంస్థ ప్రత్యేకంగా ఈ కవర్‌ను రూపొందించింది. దీన్ని ఆధునిక సౌందర్యానికి శాస్త్రీయ స్ఫూర్తిని మేళవించి తీర్చిదిద్దింది. వందేమాతరం గేయ రచయిత అయిన ఆ మహనీయుడి వారసత్వాన్ని మరింత మంది పాఠకులకు చేరవయ్యేలా హిందీ, తమిళ అనువాదాలు ఒకేసారి విడుదలవుతున్నాయి.

పురాణాలు, సాహిత్య ఆధారాల నుంచి సేకరించిన ప్రామాణికమైన విషయాలను రామేశ్వరం పుస్తకం వివరిస్తుంది. రామేశ్వర దేవాలయ సముదాయంలోని పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన నిర్మాణ శైలి, శిల్పకళ, దేవతామూర్తుల గురించి సమగ్రంగా వివరిస్తుంది. ఈ ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పాఠకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించటమే ఈ పుస్తక ప్రధాన ఉద్దేశం.

For detailed information about book please click here

 

***


(రిలీజ్ ఐడి: 2235028) సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Kannada , Malayalam