ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్ లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్: లక్షకు పైగా పాఠశాలల్లో యూఐడీఏఐ ప్రత్యేక డ్రైవ్, లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం
పాఠశాలలతో కలిసి పనిచేస్తున్న యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాలు, రాష్ట్రాల విద్యాశాఖలు
గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా మిషన్ మోడ్‌లో వేగంగా కొనసాగుతున్న తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియ.
7-15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధార్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియ అక్టోబర్ 1, 2025 నుంచి ఒక సంవత్సరం పాటు ఉచితం
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 12:47PM by PIB Hyderabad
ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త మైలురాయిగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా 1.03,000 కంటే ఎక్కువ పాఠశాలల్లో బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేసింది. ఈ ప్రత్యేక డ్రైవ్, లక్షలాది మంది విద్యార్థులు తమ పాఠశాల ప్రాంగణాల్లోనే ఎంతో సులభంగా, సౌకర్యవంతంగా తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయడంలో తోడ్పడింది.
ఈ భారీ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 1.2 కోట్ల (12 మిలియన్ల) మంది విద్యార్థులు తమ పాఠశాలలోనే బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకున్నారు.
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) అప్లికేషన్‌తో సాంకేతిక అనుసంధానం విజయవంతంగా పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 2025లో యూఐడీఏఐ పాఠశాల విద్యార్థుల కోసం ఈ మిషన్ మోడ్‌లో ఎంబీయూ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కేంద్ర విద్యాశాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలోని యూడీఐఎస్ఈ+తో అనుసంధానం వల్ల ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ పెండింగ్‌లో ఉందో సులభంగా తెలుసుకునేందుకు సహాయపడింది. అప్‌డేట్ చేయాల్సిన విద్యార్థులను గుర్తించిన తర్వాత నేరుగా పాఠశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయడం సులభమైంది.
దేశవ్యాప్తంగా ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖలు, జిల్లా యంత్రాంగం, పాఠశాలలు. యూఐడీఏఐ పరిసర భాగస్వాములతో కలిసి పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నాయి.
ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనీసం 4,000 పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఈ వేగాన్ని మరింత పెంచేందుకు ఈ సంఖ్యను ఇంకా పెంచే పనిలో యూఐడీఏఐ ఉంది.
పిల్లల ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు పొందడానికి అవసరమైన ధ్రువీకరణ సులభమవుతుంది. నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ అప్‌డేట్ దోహదపడుతుంది.
గత ఆరు నెలలుగా ఈ మిషన్ మోడ్ ఎంబీయూ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. 7 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ఆధార్‌లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను అక్టోబర్ 1, 2025 నుంచి ఒక సంవత్సరం పాటు పూర్తి ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.
పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలతో పాటు పిల్లలు దేశవ్యాప్తంగా ఉన్న ఏవైనా ఆధార్ నమోదు కేంద్రాలు లేదా ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించి కూడా తమ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2235026)
సందర్శకుల సూచీ సంఖ్య : : 81