ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దేశవ్యాప్త హెచ్‌పీవీ టీకా ప్రచారం.. రూ. 17,000 కోట్లవ విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో తన ప్రసంగంలోని ముఖ్య విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 FEB 2026 8:44PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దేశవ్యాప్త హెచ్‌పీవీ టీకా ప్రచార కార్యక్రమంరూ. 17,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగంలోని కీలక అంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

 

‘‘మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందిఇందులో భాగంగా నేడు అజ్మీర్ నుంచి దేశవ్యాప్త హెచ్‌పీవీ (హెచ్‌పీవీటీకా కార్యక్రమాన్ని ప్రారంభించానుదీంతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలుప్రారంభోత్సవాలుయువతకు నియామక పత్రాలను పంపిణీ చేసే అవకాశం నాకు లభించింది’’

 

‘‘యువతకు సాధికారత కల్పించేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కట్టుబడి ఉందిఅజ్మీర్‌లో నా యువ మిత్రులకు నియామక పత్రాలను అందజేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’’

 

‘‘అజ్మీర్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న రాజస్థాన్ కుటుంబ సభ్యుల ఉత్సాహం చూస్తుంటే.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర అభివృద్ధి పనులపై వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారో స్పష్టమవుతోంది’’

 

‘‘వీరనారుల ప్రాంతమైన రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కుమార్తెల కోసం హెచ్‌పీవీ టీకా ప్రచారాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందిదేశంలోని మాతృశక్తిని ఆరోగ్యవంతంగాశక్తిమంతంగా తీర్చిదిద్దే దిశలో ఇది ఒక కీలక చర్య’’

 

‘‘ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వరుస ఓటములను ఎదుర్కొంటుందిఆ కోపంతో దేశాన్ని కించపరుస్తూ ప్రతీకారం తీర్చుకుంటోందిప్రపంచ ఏఐ సదస్సులో విదేశీ అతిథుల ముందు భారత్‌ను అవమానించేందుకు వారు చేసిన ప్రయత్నమే దీనికి నిదర్శనం’’

 

‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయత్నాలతో రాజస్థాన్‌లోని మా రైతు సోదరసోదరీలకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతోందికాంగ్రెస్ దుష్పరిపాలనకుబీజేపీ సుపరిపాలనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది’’

 

‘‘గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జాతీయ హెచ్‌పీవీ టీకా ప్రచారాన్ని నేడు అజ్మీర్‌ నుంచి ప్రారంభించాంఇందులో భాగంగా అజ్మీర్‌కు చెందిన మనీషా రావత్ మొదటి టీకా తీసుకున్నారుమహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక ప్రధాన కార్యక్రమం’’

 

‘‘గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ టీకా ప్రచారం ప్రారంభించిన తర్వాత నేడు టీకాలు తీసుకున్న నా యువ స్నేహితులతో మాట్లాడానుఇది మన కుమార్తెలుతల్లుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఒక నిర్ణయాత్మక అడుగు’’

 

****


(రిలీజ్ ఐడి: 2234266) సందర్శకుల సూచీ సంఖ్య : : 6