ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌లో కెనడా ప్రధానమంత్రి పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 10:40AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకున్న కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటనకు రానున్నారుఆయన 2026 ఫిబ్రవరి 27 నుంచి మార్చి వరకు భారత్‌లో అధికార పర్యటనలో ఉంటారుప్రధాని శ్రీ కార్నీ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటి సారి.

ప్రధాని శ్రీ కార్నీ ఫిబ్రవరి 27న ముంబయి చేరుకొంటారురెండు రోజుల పాటుఆయన వేర్వేరు వాణిజ్య ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటారుభారతీయ సీఈఓలుకెనడా సీఈఓలుపరిశ్రమ నిపుణులుఆర్థిక నిపుణులునూతన ఆవిష్కర్తలువిద్యారంగ ప్రముఖులతో పాటు భారత్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న కెనడా పెన్షన్ ఫండ్స్ విషయమై కూడా శ్రీ కార్నీ మాటామంతీ జరుపుతారు.

మార్చి నెల 1న ప్రధాని శ్రీ కార్నీ న్యూఢిల్లీకి వెళ్తారుమార్చి 2వ తేదీనప్రధానమంత్రులు ఇద్దరూ హైదరాబాద్ హౌస్‌లో ప్రతినిధి వర్గ స్థాయి చర్చల్లో పాల్గొంటారుఇద్దరు నేతలూ భారత్-కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్న వివిధ రంగాల్లో ఇంతవరకు నమోదైన పురోగతిని సమీక్షిస్తారు. 2025 జూన్‌లో కనానస్కిస్‌లోనూ, 2025 నవంబరులో జోహాన్సెస్‌బర్గ్‌లోనూ ఉభయులూ నిర్వహించిన సమావేశాలకు కొనసాగింపుగా ప్రస్తుతం ఈ సమావేశాలు చోటు చేసుకోనున్నాయివాణిజ్యంపెట్టుబడిఇంధనంకీలక ఖనిజాలువ్యవసాయంవిద్యపరిశోధననవకల్పనఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా కీలక రంగాల్లో ప్రస్తుత సహకారాన్ని కూడా వారు సమీక్షిస్తారునేతలిరువురూ ప్రాంతీయప్రపంచ పరిణామాలపై తమ అభిప్రాయాల్ని పంచుకుంటారు.

ప్రధానమంత్రి శ్రీ మోదీప్రధాని శ్రీ కార్నీ అదే రోజున జరగనున్న భారత్కెనడా సీఈఓల వేదిక సమావేశంలోనూ పాల్గొంటారు.

భారత్, కెనడాల ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకుపోతున్న క్రమంలో ఒక ముఖ్య తరుణంలో ఈ పర్యటన చోటు చేసుకొంటోందిఇద్దరు ప్రధానులూ ఇదివరకే ఒక నిర్మాణాత్మకసమతౌల్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలని సమ్మతిని వ్యక్తం చేశారుఆ భాగస్వామ్యం పరస్పర ఆందోళనకారకాలూసూక్ష్మగ్రాహ్యత ల విషయంలో పరస్పర గౌరవంబలమైన ప్రజా సంబంధాలుఅంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక పూరకత్వంపై ఆధారపడనుందినేతలిద్దరి మధ్య జరగబోయే సమావేశం సానుకూల గతిని వేగిరం చేయడానికే కాక భారత్కెనడాల మధ్య భవిష్యోన్ముఖ భాగస్వామ్యాన్ని పటిష్ఠపరుచుకోవాలన్న ఉమ్మడి దృష్టికోణాన్ని అలవరుచుకొనేందుకు కూడా ఓ సదావకాశాన్ని అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2233284) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam