ఆయుష్
ప్రధానమంత్రి యోగ పురస్కారాలు-2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ఆరంభం
భారత్‌తో పాటు, ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రచారం
చేయడంలో మార్పు తీసుకువచ్చిన వారికి సత్కారం
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2026 4:12PM by PIB Hyderabad
దూరదృష్టి కలిగిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఇటీవలి సంవత్సరాల్లో యోగా వ్యాప్తిలో అపూర్వ అభివృద్ధి చోటుచేసుకొంది. దీనిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్థాయికి చేరుకొంది. సముదాయాల ద్వారా నివారక ఆరోగ్య పద్ధతుల్ని అనుసరించడం మొదలు సంస్థల ద్వారా యోగాను ఆరోగ్య, వెల్నెస్ అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఏకీకరించడం వరకూ, ఈ విభాగం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సమగ్ర దృష్టికోణం మాధ్యమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పౌరులకు మేలును చేకూరుస్తోంది.
ఈ ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోతూ, ప్రపంచం నలు మూలలా యోగ ప్రభావాన్ని విస్తరింప చేసే దిశగా నిరంతరం పాటుపడుతున్న వ్యక్తులను, సంస్థలను ‘ప్రధానమంత్రి యోగ పురస్కారాలు-2026’తో సత్కరించనున్నారు. యోగా అభివృద్ధి, ప్రచార ప్రక్రియల్లో ప్రావీణ్యాన్నీ, అంకితభావాన్నీ గుర్తించి, ఈ రంగంలో విస్తృత భాగస్వామ్యానికీ, నవకల్పనకీ, నాయకత్వానికీ ప్రేరణను అందించడమే ఈ అవార్డుల ముఖ్యోద్దేశం.
ప్రధానమంత్రి యోగ పురస్కారాలు-2026 కు గాను దరఖాస్తులను ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ పురస్కారాలు యోగా అభివృద్ధి, ప్రచారంలో మార్గదర్శక తోడ్పాటును గుర్తింపునిస్తాయి. ఈ గుర్తింపును జాతీయ, అంతర్జాతీయ స్థాయులు రెండిటిలోనూ ఇవ్వనున్నారు.
దరఖాస్తులను జాతీయ పురస్కారాల పోర్టల్ www.awards.gov.in లో సమర్పించవచ్చును.
ప్రతి ఒక్క పురస్కార విజేతనీ ఈ కింద పేర్కొన్న ప్రకారం సత్కరిస్తారు:
• ఒక విజయచిహ్నం
• ఒక ధ్రువపత్రం
• రూ.25 లక్షల నగదు పురస్కారం
పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని అంతర్జాతీయ యోగా సమావేశంతో కలిపి నిర్వహిస్తారు.
పురస్కారాల్లో కేటగిరీలు
కేటగిరీ-1: ప్రధానమంత్రి యోగా పురస్కారాలు-వ్యక్తులు (జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో)
• రెండు అవార్డులు
కేటగిరీ-2: ప్రధానమంత్రి యోగా పురస్కారాలు-సంస్థలు (జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో)
• రెండు అవార్డులు
అర్హత ప్రమాణాలు
యోగ గురించి ప్రచారం చేయడానికీ, యోగా అభివృద్ధికీ అసాధారణ సేవలను అందించిన వ్యక్తులను, సంస్థలను గౌరవించడం ఈ పురస్కారాల ఉద్దేశం.
దరఖాస్తుదారులు, నామినీలు తప్పనిసరిగా ఈ కింది అంశాలను నెరవేర్చాలి:
• యోగాలో విస్తృత అనుభవంతో పాటు లోతైన అవగాహనను కూడా కలిగివుండాలి.
• వ్యక్తిగత కేటగిరీలో (జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో) కనీస వయోపరిమితి: 30 ఏళ్లుండాలి.
• కనీసం 10 (పది) సంవత్సరాల సేవ, మచ్చలేని ట్రాక్ రికార్డుతో పాటు యోగ వ్యాప్తికి విశేష తోడ్పాటును అందించి ఉండాలి.
దరఖాస్తు కాల పరిమితి
• దరఖాస్తుల సమర్పణకు ఆరంభ తేదీ: 2026 ఫిబ్రవరి 21.
• దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 2026 మార్చి 21.
అవసరపడితే నమోదుకు చివరి తేదీని గరిష్ఠంగా పదిహేను రోజుల వరకు పొడిగించేందుకు అవకాశం ఉంది. చివరి తేదీ దాటిన తరువాత అందిన ఏ దరఖాస్తును అయినా తిరస్కరించే హక్కు ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఉంది.
నిర్ధారిత కాల పరిమితి లోపల జాతీయ పురస్కారాల పోర్టల్ (www.awards.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అర్హతలు కల వ్యక్తుల్నీ, సంస్థల్నీ కోరుతున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2232872)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam