రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

షెగావ్‌లో జాతీయ ఆరోగ్య ఉత్సవం-2026ను ప్రారంభించిన భారత రాష్ట్రపతి


పౌరుల ఆరోగ్య సంరక్షణకు అసాధారణ సేవలందిస్తున్న ఆయుష్ వైద్య వ్యవస్థలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 25 FEB 2026 2:26PM by PIB Hyderabad

మహారాష్ట్రలో బుల్ధానాలోని షెగావ్‌లో ఇవాళ (25 ఫిబ్రవరి 2026) జాతీయ ఆరోగ్య ఉత్సవం-2026ను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారుఆయుష్ ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష కృషి చేసిన ఆరుగురు సీనియర్ వైద్యులను ఆమె సన్మానించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. మన సంప్రదాయంలో ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారుదేశాన్ని శక్తిమంతగా మార్చటంలో ఆరోగ్యవంతమైన పౌరులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారుప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్ వైద్య విధానాలు ఎన్నో సేవలందించాయనిఆధునిక వైద్యం అందుబాటులో లేనప్పటి నుంచే యోగఆయుర్వేదంసిద్ధ వంటి పద్ధతులు ప్రజలకు సేవలందిస్తున్నాయని కొనియాడారు.

మన పొలాలువంటిళ్లుఅడవుల్లో ఔషధ మొక్కలుఆరోగ్యాన్ని కాపాడే వనమూలికల వంటి విలువైన నిధులున్నాయని రాష్ట్రపతి అన్నారుఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అందించటానికిపర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఈ విలువైన సంపదను పరిరక్షించటంఅభివృద్ధి చేయటం కీలకమన్నారుఔషధ మొక్కలను పెంచటం వల్ల రైతుల ఆర్థికస్థితి మెరుగుపడటమే కాకనేల సారాన్నిసంరక్షణను కూడా పెంపొందించవచ్చని తెలిపారుఆయుష్ విధానాలను ప్రోత్సహించటం వల్ల ప్రజలు శారీరకంగాఆర్థికంగా మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఆరోగ్యకరమైనసమతుల్యమైన జీవనశైలికి ఆయుర్వేదంయోగాఇతర ఆయుష్ విధానాలు మార్గనిర్దేశం చేస్తాయని రాష్ట్రపతి అన్నారువ్యాధి నివారణలో సమగ్ర వైద్యం ప్రాముఖ్యతను నేడు ప్రపంచం గుర్తిస్తోందన్నారుఒత్తిడిని దూరం చేసుకునిఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యోగా సాధన చేస్తున్నారని.. ఆయుర్వేద చికిత్సలుఔషధాలతో ప్రయోజనం పొందుతున్నట్లు వెల్లడించారు.

ఆధారాలతో కూడిన పరిశోధనఔషధాల ప్రామాణీకరణనాణ్యత నియంత్రణ వంటివి ఆయుష్ వ్యవస్థల గుర్తింపునుఆచరణను ప్రోత్సహిస్తాయని రాష్ట్రపతి తెలిపారుఈ దిశగా ఆయుష్ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషి పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారుప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా.. పరిశోధనఔషధాల అభివృద్ధికి సంబంధించిన సాధారణ మార్గదర్శకాలను రూపొందించినట్లు చెప్పారుఆధునిక ఆరోగ్య సవాళ్ల పరిష్కారానికి ఆయుర్వేదయోగాఆయుష్ వ్యవస్థలను నెలకొల్పేందుకు ఎన్నో శాస్త్రీయ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారుఆధునిక శాస్త్రీయ పరిష్కారాలుఆవిష్కరణలుఅంతర్జాతీయ సహకారం ద్వారా సంప్రదాయ వైద్య పద్ధతులకు మరింత ప్రాచుర్యం కల్పించటం ద్వారా వాటిని సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అంతర్భాగంగా చేసివిజయం సాధించవచ్చని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Please click here to see the President's Speech-

 

***


(రిలీజ్ ఐడి: 2232867) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam