ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పీఎమ్ సూర్య ఘర్ పథకం కింద రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వినియోగం 30 లక్షల గృహాలకు చేరడం ప్రశంసనీయం: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 FEB 2026 8:41PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్తును అందించడం ద్వారా పీఎమ్ సూర్య ఘర్ పథకం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. భారత్ పరిశుద్ధ ఇంధన ప్రయాణంలో ప్రశంసనీయ ముందడుగుగా దీనిని ఆయన అభివర్ణించారు.

రూఫ్‌టాప్ సోలార్‌ను స్వీకరించిన లబ్ధిదారులందరినీ ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం పౌరుల్లో పొదుపు, సుస్థిరత, స్వయం-సమృద్ధిని పెంపొందిస్తుందని ఆయన అన్నారు.

ఇంధన-సురక్షితమైన, హరిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భారత్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ పథకం కీలకమైన భాగమని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“భారత పరిశుద్ధ ఇంధన ప్రయాణంలో ప్రశంసనీయ ముందడుగు!

ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంది, రూఫ్‌టాప్ సౌర విద్యుత్తును స్వీకరించడం ద్వారా పొదుపు, సుస్థిరత, స్వయం-సమృద్ధిని పెంపొందించిన వారందరికీ అభినందనలు.

ఇంధన-సురక్షితమైన, హరిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భారత్ నిర్మాణం కోసం మా ప్రయత్నాల్లో ఈ పథకం కీలక భాగంగా ఉంది. 

#30LakhsPMSuryaGhar” 


(రిలీజ్ ఐడి: 2232322) సందర్శకుల సూచీ సంఖ్య : : 44
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam