ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలితకు ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 9:33AM by PIB Hyderabad

ఈ రోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారుప్రజాకర్షక నాయకురాలిగాగొప్ప పరిపాలనా దక్షురాలిగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని ప్రధానమంత్రి కొనియాడారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె పని చేసిన కాలాన్ని శ్రీ మోదీ గుర్తు చేశారుమహిళా సాధికారతసామాజిక న్యాయంసమగ్రాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. సంక్షేమ పాలన అందించారన్నారు.

ఆమెతో జరిపిన సంభాషణలను ప్రధానమంత్రి ఆనందంగా గుర్తు చేసుకున్నారుఆమె జీవితంకృషి గురించి కొన్ని ప్రత్యేక అంశాలను ఈ నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో శ్రీ మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘జయలలిత గారు జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నానుఅనేక మంది హృదయాలుఆలోచనల్లో ప్రజాకర్షణ ఉన్న నాయకురాలిగాగొప్ప పరిపాలనా దక్షురాలిగా ఆమె శాశ్వత స్థానం సంపాదించుకున్నారుఆమె జీవితమంతా ధైర్యాన్నిసంకల్పాన్ని ప్రదర్శించారుమహిళా సాధికారతసామాజిక న్యాయంసమగ్రాభివృద్ధిపై దృష్టి సారించి విజయవంతంగా సంక్షేమ పాలనను అందించారుఆమెలో కరుణదృఢ నిర్ణయ సామర్థ్యం రెండూ ఉన్నాయిఆమెతో నా సంభాషణలను ఆనందంగా గుర్తు చేసుకుంటున్నాను.

ఈ నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె గురించి నేను కొన్ని విషయాలు పంచుకున్నాను’’

 

***


(రిలీజ్ ఐడి: 2232313) సందర్శకుల సూచీ సంఖ్య : : 13