మంత్రిమండలి
azadi ka amrit mahotsav

గిఫ్ట్ (జీఐఎఫ్‌టీ) సిటీ నుంచి షాపూర్ వరకు గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎమ్ఆర్‌సీ) ఉత్తర-దక్షిణ కారిడార్ విస్తరణకు కేబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 3:33PM by PIB Hyderabad

గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు 3.33 కిలోమీటర్ల పొడవున మెట్రో కారిడార్ విస్తరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపిందిఇందులో మూడు ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయిఈ ప్రాజెక్టును దాదాపు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు.

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,067.35 కోట్లుఈ విస్తరించిన కారిడార్ 2029 నాటికి సుమారు 23,702 మంది ప్రయాణికులకు, 2041 నాటికి సుమారు 58,059 మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు.

అహ్మదాబాద్గిఫ్ట్ సిటీ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని ఈ కారిడార్ బలోపేతం చేస్తుందిప్రతిపాదిత మార్గంలో ఉన్న ప్రధాన బహుళజాతి కంపెనీలువిద్యా సంస్థలువాణిజ్య కేంద్రాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది.

ఈ విస్తరణ అహ్మదాబాద్-గిఫ్ట్ సిటీ ప్రాంతాల మధ్య ప్రయాణించే రోజువారీ ప్రయాణికులకు వ్యాపారంఉపాధివిద్యా సంబంధిత ప్రయాణ అవసరాలను తీర్చడానికి ప్రయోజనకరంగా ఉంటుందితద్వారా నెట్‌వర్క్ ఏకీకరణప్రయాణికుల సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం సుమారు 1,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారునిర్మాణానంతర దశలో కార్యాచరణనిర్వహణ ద్వారా సుమారు 250 మంది ఉపాధి పొందుతారుఈ ప్రాజెక్టు పైన పేర్కొన్న సంఖ్యకు సమానమైన ప్రత్యక్ష ఉపాధి అవకాశాలనూ గణనీయ సంఖ్యలో సృష్టిస్తుందిఇతర కార్యకలాపాల ద్వారా మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

భారత ప్రభుత్వంగుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాల 50:50 జాయింట్ వెంచర్ అయిన గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది.

నేపథ్యం:

ప్రస్తుతంగుజరాత్ మెట్రో 68.28 కిలోమీటర్ల విస్తీర్ణంలో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-I {ఏపీఎంసీ నుంచి మోతెరా స్టేడియం (నార్త్-సౌత్ కారిడార్)... థాల్తేజ్ గామ్ నుంచి వస్త్రల్ గామ్ (ఈస్ట్-వెస్ట్ కారిడార్)}... ఫేజ్-II (మోతెరా స్టేడియం నుంచి మహాత్మా మందిర్జీఎన్ఎల్‌యూ నుంచి గిఫ్ట్ సిటీ వరకుమొత్తం 53 స్టేషన్లతో సెప్టెంబర్-2022 (ఫేజ్-I)జనవరి-2026 (ఫేజ్-II) నుంచి విజయవంతంగా కార్యకలాపాలను ప్రారంభించాయిఈ లైన్‌లో ప్రయాణిస్తున్న రోజువారీ ప్రయాణికుల సంఖ్య దాదాపు 1,60,000గా ఉంది.

 ****


(రిలీజ్ ఐడి: 2232200) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam