ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ కేంద్ర శంకుస్థాపనలో తన ప్రసంగ ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 21 FEB 2026 8:55PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లో హెచ్‌సీఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ కేంద్ర శంకుస్థాపనలో తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శ్రీ మోదీ వరుస పోస్టులు చేశారువాటిలో ఇలా పేర్కొన్నారు:

‘‘భారత్‌లో సెమీకండక్టర్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉత్తరప్రదేశ్ ఎదుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణంహెచ్‌సీఎల్ఫాక్స్‌కాన్ ఏర్పాటు చేసిన కొత్తపరిశ్రమ టెక్నాలజీ శక్తి కేంద్రంగా ఈ రాష్ట్ర నూతన గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది."

 

"ఈ దశాబ్దం భారతదేశపు టెకేడ్హరిత ఇంధనం నుంచి కృత్రిమ మేధ వరకు ఈ దశాబ్దంలో సాంకేతిక రంగంలో భారత్ చేస్తున్న కృషి, 21వ శతాబ్దంలో మన సామర్థ్యానికి పునాదిగా నిలుస్తుంది."

 

"ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే..దానిని సాధించి చూపిస్తానని గడిచిన 11 ఏళ్లుగా భారత్ నిరూపిస్తూనే ఉందిఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కూడా దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి."

 

***


(రిలీజ్ ఐడి: 2231592) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam