ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 9:35AM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంప్రదాయంప్రకృతి మధ్య సామరస్యానికి అరుణాచల్ ప్రదేశ్ గొప్ప ఉదాహరణ అని పీఎం కొనియాడారుస్ఫూర్తిమంతమైనశ్రమించే తత్వం ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు దేశ పురోగతిని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

అద్భుతమైన ప్రకృతి సౌందర్యంఅసాధారణ సాంస్కృతిక వైవిధ్యం అరుణాచల్ ప్రదేశ్ సొంతంసంప్రదాయానికిప్రకృతికి మధ్య సామరస్యానికి ఈ రాష్ట్రం గొప్ప ఉదాహరణగా నిలుస్తోందిదేశ పురోగతిని బలోపేతం చేయడంలో స్ఫూర్తిమంతమైనశ్రమించే తత్వం ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు కీలకపాత్ర పోషిస్తున్నారుఅదే సమయంలో వైవిధ్యమైన రాష్ట్ర గిరిజన సంస్కృతులు దేశానికి అపారమైన సుసంపన్నతను జోడిస్తున్నాయి.

భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధిలో నూతన శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను”.


(రిలీజ్ ఐడి: 2230642) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam