ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

గ్రీస్ ప్రధాని గౌరవ కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 7:15PM by PIB Hyderabad

ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభ సందర్భంగా హెలెనిక్ రిపబ్లిక్ (గ్రీస్ప్రధానమంత్రి శ్రీ కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ ఈ రోజు అయ్యారున్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో పాల్గొనడానికి గ్రీస్ ప్రధానమంత్రి ఈ నెల 18-19 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారుప్రధాని గౌరవ శ్రీ మిత్సోటాకిస్‌ వెంట ఆ దేశ డిజిటల్ గవర్నెన్స్ మంత్రి శ్రీ డిమిట్రియోస్ పాపాస్టెర్గియోసీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.

ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధిని ఈ సందర్భంగా ఇరువురు నేతలు సమీక్షించారువిభిన్న రంగాల్లో భాగస్వామ్యం స్థిరమైన వేగంతో పురోగమిస్తుందని వారు గుర్తించారుప్రాంతీయప్రపంచ సంబంధిత అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న ఇరువురు నేతలు... పరస్పర ప్రయోజనకరమైన నూతన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగే మార్గాలను గురించి చర్చించారుఐఎమ్ఈసీ కింద ఇటీవల చేపట్టిన కనెక్టివిటీ కార్యక్రమాలనువాటిని మరింత విస్తరించే సామర్థ్యాలను ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి పర్యటనలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చాయనీ... ఇటీవల ఖరారైన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్యంపెట్టుబడులకు కొత్త మార్గాలను తెరుస్తుందని ఇరువురు నేతలు అంగీకరించారు.

గ్రీస్ ప్రధానమంత్రి మిత్సోటాకిస్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారిఆయన గతంలో 2024 ఫిబ్రవరిలో భారత్‌లో అధికారిక పర్యటన నిర్వహించారు. 15 సంవత్సరాల తర్వాత గ్రీస్ ప్రభుత్వాధినేత భారత్‌లో పర్యటించడం అదే తొలిసారిఅంతకుముందుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న ఏథెన్స్‌ను సందర్శించారుఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2230503) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam