ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 8:48AM by PIB Hyderabad
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ దూరదర్శి నేత,అసాధారణ పరిపాలకుడు, వ్యూహ రచన నిపుణుడు, స్వరాజ్య యోధునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలు సదా స్ఫూర్తిని ఇస్తున్నాయని, ఆయన పాలన దారి దీపంగా నిలుస్తోందని, న్యాయం పట్లా ఆత్మగౌరవం పట్లా ఆయనలో పొంగిపొరలిన ఉత్సాహం నేటికీ సమాజాన్ని దృఢతరం చేస్తోందని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ప్రతి మనిషి సంక్షేమానికి మిగతా అన్నిటి కన్న మిన్న అయిన స్థానాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చారనీ, ప్రజలను కాపాడడానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకొన్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నిబద్ధత కారణంగానే ఆయన జీవితం తరాల తరబడి భారత్‌కు మార్గదర్శకంగా ఉంటోందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అనేక సందేశాలను శ్రీ మోదీ పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా , ఆ దూరదర్శి నేత, అసాధారణ పరిపాలకుడు, వ్యూహరచన నిపుణుడు, స్వరాజ్య యోధుని పట్ల ఆరాధన భావంతో ప్రణామం చేద్దాం.
ఆయన ధైర్య సాహసాలు, ఆయన పాలన మనకు దారిని చూపుతూ ఉండాలని, న్యాయ పాలన, ఆత్మగౌరవం.. వీటి విషయంలో ఆయన కనబరిచిన ఉత్సాహం మన సమాజాన్ని దృఢతరం చేయాలని నేను కోరుకుంటున్నాను.
“छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीनिमित्त, दूरदर्शी नेते, कुशल प्रशासक, विलक्षण रणनीतीकार आणि स्वराज्याचे पुरस्कर्ते अशा महान व्यक्तिमत्त्वाला आम्ही साष्टांग नमन करतो.
त्यांचे शौर्य आपल्याला प्रेरणा देईल, त्यांचे सुशासन आपल्यासाठी मार्गदर्शक ठरेल आणि न्याय व स्वाभिमानाची त्यांची भावना आपल्या समाजाला अधिक सक्षम करेल.”
శ్రీ మోదీ మరో సందేశంలో ఓ సంస్కృత శ్లోకాన్ని ఉదాహరిస్తూ, ఇలా రాశారు:
‘‘ప్రజల సంక్షేమాన్ని మిగతా అన్నిటి కన్న మిన్నగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భావించారు. ప్రజల రక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. ఈ కారణంగా ఆయన జీవితం నేటికీ భరత వర్షానికి దారి దీపంగా నిలుస్తోంది.
గోపాయితారం దాతారం ధర్మనిత్యమతన్ద్రితమ్
అకామద్వేషసంయుక్తమనురజ్యన్తి మానవా:’’
(రిలీజ్ ఐడి: 2230175)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam