సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్-2026లో మహారాష్ట్ర వ్యూహాత్మక పరిశ్రమ విస్తరణకు ఎన్ఎఫ్‌డీసీ తోడ్పాటు
ఈఎఫ్ఎమ్ బెర్లిన్‌లో ఫిల్మ్ సిటీ మౌలిక వసతులతో పాటు
మరాఠీ సినిమా, గ్లోబల్ కో-ప్రొడక్షన్ అవకాశాలను ప్రదర్శించిన మహారాష్ట్ర
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2026 4:21PM by PIB Hyderabad
బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటు బెర్లిన్‌లో నిర్వహించిన యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్ (ఈఎఫ్ఎమ్)-2026లో మహారాష్ట్ర ప్రతినిధి బృంద భాగస్వామ్యాన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌డీసీ) సులభతరం చేసింది.
చలనచిత్ర ఫైనాన్సింగ్, అమ్మకాలు, పంపిణీ, అంతర్జాతీయ సహ-నిర్మాణ అవకాశాల కోసం ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వేదికల్లో యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్ ఒకటి. ఈఎఫ్ఎమ్ ప్రపంచవ్యాప్త ప్రముఖ నిర్మాతలు, స్టూడియోలు, అమ్మకాల ఏజెంట్లు, నిర్ణయాధికారులను ఒకచోట చేర్చుతుంది. ఈ మార్కెట్ ప్రత్యేకంగా ఎంపిక చేసిన జాతీయ ప్రదర్శనలు, వ్యూహాత్మక పరిశ్రమ భాగస్వామ్యాల కోసం అర్థవంతమైన సహకారాలు, ప్రపంచ మార్కెట్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన వేదికను అందిస్తుంది.
ప్రపంచ ప్రేక్షకులకు భారత సృజనాత్మకత బలాన్ని ప్రదర్శించడం కోసం వేవ్స్ బజార్ ద్వారా ప్రత్యేకంగా ఎంపిక చేసిన భారత్ పర్వ్ వేదికగా భారత విస్తృత సాంస్కృతిక, పరిశ్రమ విస్తరణలో భాగంగా ఈ భాగస్వామ్యం ఏర్పడింది.
మహారాష్ట్ర ప్రతినిధి బృందానికి మహారాష్ట్ర ప్రభుత్వ ఐటీ, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీ ఆశిష్ షెలార్ నాయకత్వం వహించారు. ఈ బృందంలో సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ కిరణ్ కులకర్ణి, సాంస్కృతిక వ్యవహారాల డిప్యూటీ కార్యదర్శి శ్రీ మహేష్ వావల్, మహారాష్ట్ర ఫిల్మ్ స్టేజ్, కల్చరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ స్వాతి మాసే పాటిల్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ సజానికర్, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ శ్రీమతి సుచిత్రా దేశ్‌పాండే, సాంస్కృతిక సమన్వయ అధికారి శ్రీ మంగేష్ రౌల్, చిత్రరూపకర్త శ్రీ మనోజ్ కదమ్ ఉన్నారు.
మహారాష్ట్ర ఫిల్మ్ స్టేజ్, కల్చరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రజెంటేషన్ సందర్భంగా రాష్ట్ర శక్తిమంతమైన చలనచిత్ర వ్యవస్థను... చలనచిత్ర నిర్మాణం, సహ-నిర్మాణం, పరస్పర సాంస్కృతిక వినియోగం కోసం ప్రపంచస్థాయి కేంద్రంగా మహారాష్ట్రను నిలపాలనే తమ దార్శనికతను స్పష్టం చేసింది.
ముంబయిలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి - ఫిల్మ్ సిటీలో గల ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రధానంగా ప్రస్తావించింది. ఇది ఒక సమగ్ర నిర్మాణ కేంద్రం అని పేర్కొన్న ప్రతినిధి బృందం... ఒకే చోట సినీ అవసరాలన్నింటి కోసం ప్రణాళికయుతంగా నిర్మించిన స్టూడియోలు, బహిరంగ సెట్లు, పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు, సాంకేతిక మౌలిక సదుపాయాలతో పూర్తి స్థాయిలో చిత్ర నిర్మాణానికి మద్దతునిచ్చేలా దీనిని రూపొందించినట్లు తెలిపింది.
ఈ ప్రతినిధి బృందం మరాఠీ సినిమా సృజనాత్మక, వాణిజ్య సామర్థ్యాన్నీ ప్రదర్శించింది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పెరుగుతున్న మరాఠీ చిత్రాల ఉనికినీ స్పష్టం చేసింది. ప్రపంచస్థాయి సహ-నిర్మాణ అవకాశాలను విస్తరించడం, ప్రతిభను పరస్పరం సద్వినియోగం చేసుకోవడం, చలనచిత్ర పర్యాటకం ప్రధాన అంశాలుగా చర్చలు జరిగాయి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న ప్రపంచ మార్కెట్ ధోరణులకు అనుగుణంగా ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ కథలను చెప్పే విధానాలను గురించీ చర్చించారు.
మహారాష్ట్ర ప్రగతిశీల విధాన ప్రణాళిక, నిధుల మద్దతునిచ్చే యంత్రాంగాలు, చిత్రనిర్మాతలకు అనుకూలమైన వాతావరణాలను అంతర్జాతీయ సహకారానికి కీలక అంశాలుగా ప్రదర్శించారు. బలమైన సంస్థాగత మద్దతు, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల మద్దతుతో ప్రపంచస్థాయి వాటాదారుల భాగస్వామ్యం కోసం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర సంసిద్ధతను ప్రతినిధి బృందం ప్రధానంగా ప్రస్తావించింది.
అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడంలో, ప్రముఖ ప్రపంచ చలనచిత్ర మార్కెట్లలో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మహారాష్ట్రకు మద్దతునివ్వడం పట్ల తన నిబద్ధతను ఎన్ఎఫ్‌డీసీ పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2228472)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5