ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026 విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 14 FEB 2026 11:29AM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలో జరిగిన ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026 విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదస్సుకు విచ్చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారుఈ సదస్సు ఇతివృత్తం ‘దశాబ్ద కాలంలో జరిగిన విచ్ఛిన్నంశతాబ్దపు మార్పు’ గురించి ప్రస్తావించారు.

21వ శతాబ్దపు గత దశాబ్దం ప్రపంచ మహమ్మారివివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తతలుయుద్ధాలుప్రపంచ సమతుల్యతను దెబ్బతీసిన సరఫరా వ్యవస్థల వైఫల్యాల వంటివి చవిచూసిందని అన్నారుసంక్షోభాలే ఒక దేశానికున్న అసలైన శక్తిని చాటిచెబుతాయని.. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీభారత్ ఈ దశాబ్ద కాలంలో అద్భుతమైన అభివృద్ధినిఅత్యుత్తమ ఫలితాలను సాధించడమే కాక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం గర్వంగా ఉందన్నారుప్రపంచ వృద్ధిని భారత్ నడిపిస్తుందనిప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తుందని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వరుస పోస్టుల్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీఈ దశాబ్ద కాలంలో భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించిందిపటిష్ఠమైన పాలనమన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు ఈ కాలాన్ని ప్రత్యేకంగా నిలిపాయి".

 

21వ శతాబ్దంలోని ఈ దశాబ్ద కాలంలో భారతదేశం సంస్కరణల వేగంతో దూసుకుపోతోంది".

 

 

"కేవలం నిధుల కేటాయింపు కోసం కాకఫలితాలే లక్ష్యంగా మేం బడ్జెట్‌ను రూపొందించాం".

 

"దశాబ్ద కాలంగా సాంకేతికతఆవిష్కరణలే వృద్ధికి కీలక ఆధారమని మేం భావిస్తున్నాం".

 

"నేటి భారతం ఆత్మవిశ్వాసంతో ప్రపంచంతో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నందున ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాం".

 

***


(रिलीज़ आईडी: 2228212) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada