సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ దార్శనికత కింద భారతదేశాన్ని ప్రపంచ కంటెంట్ హబ్‌గా నిలుపుతున్న వేవ్స్
సృజనాత్మక మూలధనాన్ని ఉద్యోగావకాశాలు, ఎగుమతుల్లో వృద్ధిగా మారుస్తూ భారతీయ దృశ్య శ్రవణ కంటెంట్ ప్రపంచవ్యాప్త విస్తరణకు ఊతమిస్తోన్న వేవ్స్ బజార్
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 4:34PM by PIB Hyderabad
ప్రభుత్వం నిర్వహిస్తోన్న 'క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్' కార్యక్రమం కింద భారతదేశాన్ని కంటెంట్ సృష్టికి ప్రపంచ కేంద్రంగా మార్చాలనే దార్శనికతకు అనుగుణంగా వేవ్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు భారతీయ క్రియేటర్స్, నిర్మాతలు, అంకురాలకు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చిన ప్రపంచ స్థాయి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, సాంకేతిక నాయకులతో అనుసంధానం కావడానికి ఒక సమగ్ర వేదికను అందించింది.
దేశవ్యాప్త సృజనాత్మక ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించే 'క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్'లో (సీఐసీ) భాగంగా యానిమేషన్, గేమింగ్, ఏఆర్, వీఆర్, సంగీతం వంటి 33 విభాగాల్లో నిర్వహించిన పోటీలకు ప్రపంచవ్యాప్తంగా ఒక లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఈ విజేతలకు మెల్బోర్న్, ఒసాకా, టొరంటో, టోక్యో, మాడ్రిడ్, బుసాన్, ఖాన్ వంటి ప్రధాన అంతర్జాతీయ వేదికలలో పాల్గొనేందుకు, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు, బీటూబీ సమావేశాల కోసం ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ఈ అవకాశం ఇండియాజాయ్, ఐజీడీసీ, ఐఎఫ్ఎఫ్ఐ గోవా వంటి జాతీయ కార్యక్రమాలలో కూడా కల్పిస్తున్నారు. తద్వారా సీఐసీ క్రియేటర్ల గుర్తింపునకు, మేధో సంపత్తి సృష్టికి ఒక కీలక ఇంజిన్‌గా నిలుస్తోంది.
మీడియా, వినోద రంగం కోసం అంకురాల నేతృత్వంలోని ఆవిష్కరణ, ఇంక్యుబేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన వేవ్‌ఎక్స్ ఉద్యోగ సృష్టి, వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం వేవ్‌ఎక్స్ భౌతిక, హైబ్రిడ్ మోడల్స్ కింద 34 అంకురాలను ఇంక్యుబేట్ చేస్తోంది. మరో 100 కంటే ఎక్కువ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. 'కళాసేతు', 'భాషాసేతు' సవాళ్ల కింద ఎంపికైన 10 అంకురాలు ఇప్పటికే ప్రభుత్వ సంస్థలతో కలిసి పైలట్ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. హైదరాబాద్‌లోని టీ-హబ్, ఐఐటీ ఢిల్లీకి చెందిన ఎఫ్ఐటీటీ, ఐఐసీటీ, ఎఫ్‌టీఐఐ, ఐఐఎంసీ వంటి ఇతర సంస్థలతో గల భాగస్వామ్యాల ద్వారా వేవ్‌ఎక్స్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించనుంది.
మరోవైపు భారతీయ దృశ్య శ్రవణ కంటెంట్ కోసం బీటూబీ సమావేశాలు, అనుమతులు, సహ-నిర్మాణం, అంతర్జాతీయ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవటాన్ని సులభతరం చేసేందుకు వేవ్స్ బజార్ ఒక ఏడాది పొడవునా పనిచేసే డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌గా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వేవ్స్ బజార్‌లో 6,000 కంటే ఎక్కువ మంది విక్రేతలు, 4,000 కంటే ఎక్కువ మంది నమోదిత కొనుగోలుదారులు ఉన్నారు. వీరి మధ్య ఇప్పటికే 8,000 కంటే ఎక్కువ బీటూబీ సమావేశాలు జరిగాయి. నాలుగు ఖండాలలోని పది కంటే ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా వేవ్స్ బజార్ పలు ఒప్పందాలు ఎంఓయూలు, పెట్టుబడి భాగస్వామ్యాలు, ప్రపంచ మార్కెట్ అవకాశాలను పెంపొందించడంలో తోడ్పడింది.
నైపుణ్యం, వ్యవస్థాపకత, ఉపాధి కల్పనను మరింత బలోపేతం చేయడానికి వేవ్స్‌ఎక్స్ ఇంక్యుబేషన్ సెంటర్ల విస్తరణ, 'క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్'ను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణులచే నిర్వహించబడే మాస్టర్‌క్లాస్‌లు, వర్క్‌షాప్‌లు, అవగాహన సెషన్లు సృజనాత్మక రంగంలోని సిబ్బంది నైపుణ్యాన్ని పెంచడంలో గణనీయంగా తోడ్పడుతున్నాయి. వేవ్స్ బజార్ ద్వారా కొనసాగుతున్న ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు.. సృజనాత్మక ప్రతిభను స్థిరమైన జీవనోపాధిగా మార్చడానికి, భారతీయ దృశ్య శ్రవణ కంటెంట్ ఎగుమతులలో వృద్ధిని సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
రాజ్యసభలో శ్రీ దీపక్ ప్రకాష్, శ్రీ ఉజ్వల్ దేవరావ్ నికామ్, శ్రీ కేసరిదేవ్‌సింగ్ ఝాలా అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమాచార- ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2227822)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5