ప్రధాన మంత్రి కార్యాలయం
మహర్షి దయానంద్ సరస్వతికి నివాళులర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 10:17AM by PIB Hyderabad
నేడు మహర్షి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్యను ప్రోత్సహించటంలో మాత్రమే కాదు.. భారత సంస్కృత, సంప్రదాయాలను సుసంపన్నం చేయటంలో ఆయన అసమాన సేవలందించారని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. "సామాజిక సంస్కరణల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకయం" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"భారతమాతకు జీవితాంతం సేవ చేసిన మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా ఆయనకు గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నా. విద్యాభివృద్ధికి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను సుసంపన్నం చేసేందుకు ఆయన చేసిన కృషి అద్వితీయమైనది. సామాజిక సంస్కరణల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి"
***
(రిలీజ్ ఐడి: 2227055)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam