జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందం.. జౌళి పరిశ్రమకు భారీ ప్రోత్సాహం

प्रविष्टि तिथि: 07 FEB 2026 5:12PM by PIB Hyderabad

భారత్అమెరికా (యూఎస్మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందాన్ని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్వాగతించిందిఇది రెండు దేశాల మధ్య వస్త్ర వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచే ఉత్ప్రేరకమని పేర్కొందిఈ ఒప్పందం జౌళి రంగానికి ప్రధాన ఆర్థిక మలుపని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

వస్త్ర ఎగుమతులకు సంబంధించివస్త్రాలుదుస్తులుఇతర వస్త్ర ఉత్పత్తులకు 118 బిలియన్ డాలర్ల అమెరికా ప్రపంచ దిగుమతుల మార్కెట్‌ చేరేందుకు మార్గం సుగమం అవుతుందిభారతదేశం నుంచి సుమారు 10.5 బిలియన్ డాలర్ల ఎగుమతులతో మనకు అతిపెద్ద ఎగుమతిదారుగా యూఎస్ ఉందిఇందులో సుమారు 70% దుస్తులు, 15% ఇతర వస్త్రాలు ఉన్నందునఇది మనకు గొప్ప అవకాశం. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ చేరుకోవటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందిఈ లక్ష్య సాధనకు కావాల్సిన వేగాన్ని ఈ ఒప్పందం అందించటమే కాకఅమెరికా ఐదో వంతుకు పైగా వాటాను కలిగి ఉంటుంది.

దుస్తులుఇతర వస్త్ర ఉత్పత్తులతో సహా అన్ని జౌళి ఉత్పత్తులపై విధించిన 18% పరస్పర సుంకాలు.. భారత ఎగుమతిదారులకున్న ప్రతికూలతను తొలగించటమే కాకఇతర పోటీదారులైన బంగ్లాదేశ్ (20%), చైనా (30%), పాకిస్తాన్ (19%), వియత్నాం (20%) కంటే తక్కువ సుంకాలతో మెరుగైన స్థితిలో ఉంటాయిఈ ఒప్పందం నేపథ్యంలో పెద్దఎత్తున కొనుగోలుచేసేవారు సరఫరా విధానాలను పునః పరిశీలించటం వల్ల మార్కెట్ పోకడలు మారుతాయి.

పరిశ్రమలు ఖర్చులను తగ్గించుకుని పోటీతత్వాన్ని పెంచుకోవటానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. జౌళి రంగానికి అవసరమైన ముడి పదార్థాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల నష్ట భయం తగ్గుతుందిఇది దేశంలో విలువ ఆధారిత వస్త్ర తయారీని సులభతరం చేయటమే కాకమన ఉత‌్పత్తులుఎగుమతులను వైవిధ్యభరితంగా మారుస్తుందిఅదనంగా ఉపాధి పెరగటంతో పాటుయూఎస్ సంస్థల నుంచి పెట్టుబడులను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2225169) आगंतुक पटल : 81
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Kannada , Malayalam