ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నాగాలాండ్‌లోని తూర్పు ప్రాంతంలో అభివృద్ధిని పెంపొందించడానికి కుదిరిన చరిత్రాత్మక ఒప్పందాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2026 9:29AM by PIB Hyderabad
నాగాలాండ్ తూర్పు ప్రాంతాన్ని త్వరిత గతిన అభివృద్ధి చేసే దిశగా ఒక చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ -

‘‘ఇది నిజంగా ఓ చరిత్రాత్మక ఒప్పందం.. మరీ ముఖ్యంగా నాగాలాండ్‌లోని తూర్పు ప్రాంత అభివృద్ధి ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది.  ప్రజలకు కొత్త అవకాశాలను అందించడంతో పాటు వారి సమృద్ధికి కూడా ఈ ఒప్పందం తోడ్పడుతుందని నేను మనసారా నమ్ముతున్నాను. దేశ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో శాంతినీ, ప్రగతినీ సాధించడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకూ అందించాలన్న మా తిరుగులేని నిబద్ధతకు ఈ ఒప్పందం అద్దం పడుతోంది’’ అని పేర్కొన్నారు.
 
***

(రిలీజ్ ఐడి: 2224772) సందర్శకుల సూచీ సంఖ్య : : 13