ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరీక్షా పే చర్చ – 2026లో విద్యార్ధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ


అందరి సూచనలూ వినండి…. మీకు నచ్చినప్పుడే మీ శైలిని మార్చుకోండి: పీఎం

ఆసక్తీ, అవగాహనా పెరిగేలా విద్యార్థులకు ముందుగానే తెలియజేయాలని ఉపాధ్యాయులకు పీఎం సూచన

లక్ష్యం చేరుకునేదిగా ఉండాలి. కానీ సులభంగా అందకూడదు... గురి పెట్టండి, ప్రయత్నించండి: పీఎం

మెదడుకు సానపెట్టండి.. అనుసంధానం కండి.. ఆ తర్వాతే చదవండి, విజయం సాధించేందుకు ఇది సాయపడుతుంది: పీఎం

విద్య, నైపుణ్యాలు, విశ్రాంతి, అభిరుచిని సమతౌల్యం చేయడమే వృద్ధికి మూలం: పీఎం

పుస్తకాలు విజ్ఞానాన్నిస్తాయి, కానీ సాధనే మిమ్మల్ని నిపుణులుగా మారుస్తుంది: పీఎం

గతం గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయొద్దు, భవిష్యత్తుపైనే దృష్టి సారించండి: పీఎం

పరీక్షల కోసమే చదువు కాదు.. జీవితం కోసం కూడా, ఎవరిని వారు సమీక్షించుకోవడమే పరీక్షల ఉద్దేశం: పీఎం

అందరిలో ఒకరిగా ఉండాలని కాదు.. ఏదైనా సాధించాలని ఆకాంక్షించండి.. : పీఎం

దేవుడిచ్చిన గొప్ప బహుమతి వర్తమానం- ఇప్పుడే, ఇక్కడే జీవించండి: పీఎం

ఈ క్షణాన్ని మీరు ఎంత ఆస్వాదిస్తే.. అంత ఎక్కువ కాలం దానిని గుర్తు పెట్టుకుంటారు: పీఎం

సామూహిక పఠనం.. అందరి వృద్ధికి దోహదం చేస్తుంది : పీఎం

పునఃశ్చరణ చేయండి.. తెలివితేటలు పెంచుకోండి: పీఎం

పాఠశాలలోనే ప్రాథమికాంశాలపై పట్టు సాధించండి.. పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది: పీఎం

పిల్లల సామర్థ్యం, ఆసక్తులకు అనుగుణంగా వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు పీఎం సూచన

మీ అభిరుచులను ఉత్పాదకాలుగా మార్చుకోండి…

ఇతరులతో వాటిని పంచుకోండి, కొత్త ఆలోచనలకు, విజయానికి ఫీడ్‌బ్యాక్ తోడ్పడుతుంది: పీఎం

మిమ్మల్ని మీరు అన్వేషించండి..మీ జీవితం అందించే ప్రతి అనుభవాన్ని ఆస్వాదించండి: పీఎం

పరీక్షలు పండగలాంటివి, వాటిని వేడుకలా జరుపుకోండి: పీఎం

అంతర్లీనంగా ఉన్న సత్యం నుంచే అసలైన ఆత్మవిశ్వాసం పుడుతుంది, మీ పట్ల మీరు నిజాయతీగా ఉండండి: పీఎం

మీ జీవితాన్ని జీవన విధానమే తీర్చిదిద్దుతుంది కానీ అనుకూలమైన వాతావరణం కాదు: పీఎం

ఆకాంక్ష లేకపోవడం నేరం - ఎల్లప్పుడూ కలలు కనండి: పీఎం

మీకు మీరే చుక్కాని, మీ సామర్థ్యాలను గుర్తించండి: పీఎం

పెద్ద కలలు కనండి, భయాన్ని వీడండి - జీవిత చరిత్రలు చదవండి: పీఎం

పరిశుభ్రతను పాటించడమే మన ప్రథమ ప్రాధాన్యం, కర్తవ్యం: పీఎం

టెక్నాలజీ మంచి ఉపాధ్యాయుడి వంటిది, దానిని నేర్చుకోండి, మీ సామర్థ్యాలను ఏఐ పెంచుతుంది: పీఎం

ఏఐను త

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2026 1:35PM by PIB Hyderabad

పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.

మీ శైలిమీ వేగం

గుజరాత్‌కు చెందిన విద్యార్థి ప్రధానమంత్రిని ఓ ప్రశ్న అడిగాడుతమ గురించి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే.. ఉపాధ్యాయులు తోడ్పాటునిస్తారని ఆ విద్యార్థి అన్నాడుఅయితే చదువుకొనే విషయంలో తమ ఉపాధ్యాయులు ఒక పద్ధతిని.. తల్లిదండ్రులు మరో విధానాన్ని సూచిస్తుంటేతాము మాత్రం మరోదాన్ని అనుసరిస్తున్నామనివీటిలో ఏది సరైనదో తెలియక తికమకపడుతున్నామని చెప్పాడుదీనికి ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుందనిప్రధానమంత్రిగా తనకు కూడా ప్రజలు వివిధ రకాల సూచనలిస్తుంటారని చెప్పారుఒక ఇంట్లో ఉన్న తోబుట్టువులకు వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉంటాయన్నారుకొందరు కూరగాయలతోఇంకొందరు పప్పుతోమరికొందరు అన్నీ కలగలిపి తింటారుప్రతి ఒక్కరికీ వారికంటూ ప్రత్యేకమైన శైలి ఉంటుందని వివరించారుఅయితేఎవరి శైలిని వారు అనుసరిస్తేనే ఆనందమన్నారుకొందరు రాత్రి పూట చదవడానికి ప్రాధాన్యమిస్తే.. మరికొందరు ఉదయాన్నే చదువుకుంటారనిఅది వారి ఇష్టానుగుణంగా ఉంటుందని శ్రీ మోదీ తెలిపారుఈ విషయంలో అబద్ధాలు చెప్పకూడదని హెచ్చరిస్తూ.. కొందరు తమ తల్లులకు ఉదయాన్నే చదువుకుంటామని చెప్పితెల్లారిన తర్వాత దాని గురించి పట్టించుకోరన్నారువిద్యార్థులు తమ సొంత శైలిని విశ్వసించాలనిసూచనలను జాగ్రత్తగా వినాలన్నారుఇతరులు చెప్పారని కాకుండావ్యక్తిగత అనుభవం ద్వారా శైలిని మెరుగుపరుచుకోవాలని సూచించారుపరీక్షా పే చర్చ మొదలుపెట్టినప్పుడు ఒక పద్ధతి ఉండేదనికాలక్రమేణా దానికి మార్పులు చేసినట్లు వివరించారుమూల ఉద్దేశానికి కట్టుబడి ఉంటూనే.. ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల్లో సెషన్లు నిర్వహిస్తున్నామన్నారుప్రధానమంత్రి స్నేహపూర్వకతత్వాన్ని గుర్తించిన విద్యార్థులు ఆయనతో చాలా సులభంగా మాట కలిపారువివిధ పద్ధతుల గురించి తెలుసుకొనివాటి నుంచి మంచిని స్వీకరించాలన్నారుకానీతమ సొంత పద్ధతిపై దృష్టి సారించి క్రమంగా దాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పారు.

తరచూ పాఠశాల లేదా ఉపాధ్యాయుల వేగాన్ని తాము అందుకోలేకపోతున్నామనివెనకబడిన పాఠాలను నేర్చుకోవాలని ప్రయత్నిస్తే.. తర్వాతి అధ్యాయాల్లో వెనకబడిపోతున్నామని ఓ విద్యార్థి చెప్పాడుఉపాధ్యాయులు బోధనలో విద్యార్థుల కంటే ఒక్కడుగు మాత్రమే ముందుండాలనిమరీ ఎక్కువ దూరంలో ఉండకూడదని శ్రీ మోదీ అన్నారులక్ష్యం చేరుకోగలిగేగా ఉండాలి కానీ.. సాధించేందుకు సులభంగా ఉండకూడదని వివరించారు. ‘‘లక్ష్యానికి చేరువగా ఉండాలికానీ అది సులభంగా దక్కేలా ఉండకూడదు’’ అని ఎగ్జామ్ వారియర్ మంత్ర 26ను విద్యార్థి గుర్తు చేసుకోగా.. అతడి జ్ఞాపకశక్తిని ప్రధాని ప్రశంసించారువిద్యార్థులకంటేఉపాధ్యాయులు 50 అడుగుల ముందుంటే విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతారుపొలాన్ని రైతు దున్నినట్టే.. విద్యార్థుల మెదడును ఉపాధ్యాయులు సిద్ధం చేయాలన్నారుప్రతి వారంలోనూ బోధించే అధ్యాయాల గురించి ఉపాధ్యాయులు ముందుగానే చెప్పాలని ఆయన సూచించారుదానివల్ల పాఠ్యాంశం ప్రారంభానికి ముందే.. విద్యార్థులు చదవడంరాయడంఆన్‌లైన్లో శోధించడం మొదలుపెడతారన్నారుబోధన వాస్తవికంగా ఉన్నప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందనిఅర్థం చేసుకొనే శక్తి పెరుగుతుందనిఏకాగ్రత మెరుగవుతుందని వివరించారుఒక అధ్యాయం ఆసక్తికరంగా ఉంటే.. విద్యార్థులు దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారనిపునఃశ్చరణ బలోపేతమవుతుందన్నానుఇది చాలా సులభమైన పద్ధతి అని.. ఇలా చేసిన తర్వాత కూడా ఉపాధ్యాయుల వేగం ఇంకా సమస్యగానే ఉంటుందా అని ప్రశ్నించారుదానికి విద్యార్థి అవును అని సమాధానమివ్వగా శ్రీ మోదీ ఉండదు అని చెప్పాలని సరిచేశారుఎందుకంటే ఉపాధ్యాయుని కంటే ఓ అడుగు ముందే ఉన్నప్పుడువిద్యార్థుల్లో వెనకబడి ఉన్నామనే భావన ఉండదన్నారు. ‘‘ముందు మెదడుకి పదును పెట్టండిదానితో అనుసంధానమవ్వండిఆ తర్వాతే పాఠాలను చదవండిఅప్పుడే.. విద్యార్థులు విజయం సాధిస్తారు’’ అని తెలిపారుప్రధానమంత్రితో ముఖాముఖిగా మాట్లాడేప్రశ్నలు అడిగేచర్చించే అవకాశం అందరికీ రాదని విద్యార్థులు అన్నారుఉపాధ్యాయుల కంటే రెండు అడుగులు ముందుండాలని సలహా ఇచ్చారనిఇప్పుడు తాము చదువులో వెనకబడిపోమని వారు వెల్లడించారు.

సంగీత సమయం

హమారా భారత్ భూమి’ పేరుతో హిందీనేపాలీబెంగాలీ భాషల్లో దేశభక్తి గీతాన్ని తాను స్వరపరిచినట్లు సిక్కింకు చెందిన విద్యార్థిని తెలియజేసిందిఆశ్చర్యపోయిన ప్రధానమంత్రి.. కవితలు రాయడం ఇష్టమా అని అడిగారువాటిని చదివి వినిపించమని ప్రోత్సహించారు. ‘ఏక్ భారత్శ్రేష్ఠ భారత్’ అన్న జాతీయ ఐక్యతా స్ఫూర్తి గురించి ఆమె పలికిన విధానాన్ని మెచ్చుకున్నారుఆ తర్వాత మాన్సీ అనే విద్యార్థినిని పాట పాడమని శ్రీ మోదీ అడిగారువిద్యార్థులకు అంకితమిస్తూ.. తన తల్లి రాసిన పాటను మాన్సీ పాడి వినిపించిందిఆమెను ప్రశంసిస్తూ.. తన తరఫున ఆమె తల్లికి అభినందనలు తెలియజేయమని ప్రధాని చెప్పారుయూట్యూబ్ ఛానల్ఫేస్‌బుక్ పేజీఇన్స్టా పేజీని తాను నడుపుతున్నట్లు ఓ విద్యార్థి చెప్పాడుతన ఫేస్‌బుక్ ఖాతాను 1.5 లక్షల మంది అనుసరిస్తున్నారని వెల్లడించాడుఆశ్చర్యపోయిన ప్రధాని అతడిని అభినందిస్తూ.. ఇలాంటి ప్రతిభావంతులైన వారిని కలుసుకోవడం తనకు గర్వకారణమన్నారు.

అస్సాం గమోఛాతో ప్రధాని విద్యార్థులకు స్వాగతం పలికారుఅది తనకు అత్యంత ఇష్టమైనదని చెప్పారుఅస్సాంఈశాన్య ప్రాంతంలో మహిళా సాధికారతకు గమోఛా చిహ్నమనిఅక్కడి మహిళలు దీనిని రూపొందిస్తారని వివరించారుఇది వారి సామర్థ్యాన్నిసహకారాన్ని సూచిస్తుందన్నారువిద్యార్థులకు గౌరవపూర్వకంగా గమోఛాను అందించాలనేది తన కోరిక అని చెప్పారు.

లక్ష్యాన్ని చేధించేలా సన్నద్ధత

విద్యార్థుల్లో ఉన్న అయోమయాన్నిభయాన్ని తెలియజేస్తూ.. నైపుణ్యాలు ముఖ్యమామార్కులు ప్రధానమాఅని సబావత్ వెంకటేశ్ అనే విద్యార్థి ప్రధానిని అడిగాడుతినడమైనా-నిద్రపోవడమైనాచదవడమైనా-ఆడుకోవడమైనానైపుణ్యాలైనా-మార్కులైనా జీవితంలో సమతౌల్యం అవసరమని ప్రధానమంత్రి సమాధానమిచ్చారుఒకవైపే మొగ్గు చూపడం అసమతౌల్యానికి దారి తీస్తుందనిసరైన సమతౌల్యం స్థిరత్వాన్ని అందిస్తుందన్నారునైపుణ్యాలు రెండు రకాలు జీవన నైపుణ్యాలువృత్తిగత నైపుణ్యాలుఈ రెండూ ముఖ్యమైనవేనని చెప్పారువిజ్ఞానంపరిశీలనఅధ్యయనం లేకుండా ఏ నైపుణ్యం మెరుగుపడదనివిజ్ఞానంతోనే నైపుణ్యం మొదలవుతుందని వివరించారు.

దీనిని ఉదాహరణలతో శ్రీ మోదీ వివరించారుజీవన నైపుణ్యాలు లేకపోతే.. వంట చేయడంరైల్వే స్టేషన్లో టిక్కెట్టు కొనుక్కోవడం లాంటి దైనందిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారుక్రమశిక్షణఆత్మవిశ్వాసంఅనుసరణీయతతో సహా జీవన నైపుణ్యాలను పూర్తిగా అలవరుచుకోవాలని ఆయన స్పష్టం చేశారువృత్తిగత నైపుణ్యాల గురించి వివరిస్తూ.. తమ నైపుణ్యాలను వైద్యులు నిరంతరం మెరుగుపరుచుకోవాలనిపుస్తక జ్ఞానం మాత్రమే హృద్రోగ నిపుణున్ని తయారుచేయలేదని తెలిపారురోగులతో కలసి పనిచేసినప్పుడే అసలు నైపుణ్యాలు అలవడతాయన్నారుఅదే విధంగా న్యాయస్థానంలో వాదించే నైపుణ్యాలు పెంపొందించుకోవాలంటే రాజ్యాంగ నిబంధనల గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. సీనియర్లతో కలసి న్యాయవాదులు ప్రాక్టీసు చేయాలికొత్త సాంకేతికతలను స్వీకరించాలంటే.. 40 ఏళ్ల వయసులో కూడా నిరంతర అభ్యాసం అవసరమని ఆయన స్పష్టం చేశారువైద్యంఇతర రంగాల్లో వస్తున్న పురోగతులను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందివిద్యనైపుణ్యాలు కవలల్లాంటివనివాటిని విడివిడిగా చూడలేమనిఅవి జీవితంలో తప్పనిసరి అని తెలిపారు.

మార్కుల పరిధిని అధిగమించిన మాధ్యమంగా విద్య

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని మణిపూర్లోని ఇంఫాల్లో ఉన్న సైనిక్ పాఠశాల విద్యార్ధి వ్యక్తం చేశాడుతనదిప్రధానిది పుట్టిన రోజు ఒకటేనని చెప్పారుగడచిపోయిన సంవత్సరాలను తాను లెక్కపెట్టననిమిగిలి ఉన్న సమయంపైనే తాను దృష్టి పెడతానని చెప్పారుగతం గురించి ఆలోచిస్తూ.. సమయాన్ని వృథా చేసుకోవద్దనిభవిష్యత్తు గురించి ఆలోచించమని విద్యార్థులను శ్రీ మోదీ కోరారు.

గతేడాది ప్రశ్నల ఆధారంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే వ్యూహాల గురించి అడిగినప్పుడు.. చాలా సందర్భాల్లో ప్రశ్నాపత్రం కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తారని ప్రధాని అన్నారుదీనికి కారణం ఆ ప్రశ్నలు సిలబస్‌లో లేకపోవడం కాదని.. కొన్ని పునరావృత నమూనాలకే పరిమితం కావడమని చెప్పారుతాను విద్యార్థిగా ఉన్న సమయంలోనూ ఇదే పరిస్థితి ఉండేదనికొన్ని సందర్భాల్లో మార్కులకే ప్రాధాన్యమిచ్చేలా ఉపాధ్యాయులు వ్యవహరించేవారన్నారుమొత్తం సిలబస్‌ను పూర్తి చేసిదానిని వాస్తవ జీవితానికి తగినట్టుగా అనువదించడం ద్వారా సమగ్ర విజ్ఞానం అందించేందుకు మంచి గురువులు ప్రాధాన్యమిస్తారన్నారుక్రికెట్లో బౌలర్‌ను ఉదాహరణగా చూపిస్తూ.. భుజం కండరాలను బలోపేతం చేసుకోవడానికే పరిమితం కాకుండా.. యోగా చేసి మొత్తం శరీరాన్నిమనసును బలోపేతం చేసుకోవాలనిఆహార నియమాలు పాటించాలనితగినంత నిద్రపోవాలని వివరించారుఅదే మాదిరిగా.. పరీక్షల కోసమే చదువు కాదనిజీవితం కోసమని తమని తాము సమీక్షించుకోవడమే పరీక్షల వెనక ఉన్న అర్థమని ఆయన చెప్పారుఅంతిమ లక్ష్యం మార్కులు కాదు.. జీవిత పరిపూర్ణాభివృద్ధి కావాలిపది ప్రశ్నలకు లేదా పద్ధతులపైనే దృష్టి సారిస్తే.. సన్నద్ధత కూడా పరిమితంగానే ఉంటుందనిసంపూర్ణ అభ్యాసంపై దృష్టి సారించాలని సలహా ఇచ్చారు.

ముఖ్యంగా పరీక్షల సమయానికి ముందు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న ప్రశ్నకు ప్రధానమంత్రి సమాధానమిచ్చారుఇది అందరికీ ఉన్న సమస్యేనని ఆయన అన్నారువిద్యను నిర్భందమైనదిగా లేదా భారంగా పరిగణించకూడదనిదానికి పూర్తిగా నిమగ్నమవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారుఅసంపూర్ణ విద్య విజయానికి మార్గం కాదన్నారుమార్కులకే ప్రాధాన్యం ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. గతేడాది బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పేరు మీకు గుర్తుందా అని ప్రశ్నించారుదానికి ఓ విద్యార్థి లేదు అని సమాధానమివ్వగా.. మార్కులకు ఎంత తక్కువ ప్రాధాన్యముందో వివరిస్తూ.. అలాంటి విజయాలను కూడా స్వల్పకాలం మాత్రమే మెచ్చుకుంటారనితర్వాత మరచిపోతారన్నారుతమ మనసును మార్కులతో ముడిపెట్టుకోవద్దనితమ జీవితం ఏ వైపు వెళుతుందో దృష్టి సారించాలన్నారుఅలాగే తరగతి గదిలో లేదా పరీక్షాకేంద్రాల్లో మాత్రమే కాకుండా.. జీవితంలో కూడా తమను తాము పరీక్షించుకోవాలని సూచించారు.

ఒత్తిడిని తగ్గించిఎక్కువ నేర్చుకోవటం

చదువుకునేటప్పుడు మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూనేర్చుకున్న పాఠాలు కూడా త్వరగా మర్చిపోతున్నాంఆ సమయంలో ప్రశాంతంగాఏకాగ్రతతో ఎలా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణ సందర్భంగా ఒక విద్యార్థి అడిగారుచక్కని ఉదాహరణతో ప్రధానమంత్రి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. "ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారుసరిగ్గా 25 ఏళ్ల తర్వాత ఎవరైన మిమ్మల్ని ఈ కార్యక్రమం గురించి అడిగితే గుర్తుంటుందామర్చిపోతారా?” అనిప్రధానమంత్రి అడగ్గా.. ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం కాబట్టి ఎప్పటికీ గుర్తుంటుందని ఆ విద్యార్థి చెప్పారుఅప్పుడు శ్రీ నరేంద్ర మోదీ ఇలా వివరించారుమీరు ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉండటమే అందుకు కారణంమీరు వర్తమానంలో జీవిస్తూఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని శ్రద్ధగా గమనిస్తున్నారుఎప్పుడైతే మనం ఒక పనిలో పూర్తిగా లీనమవుతామోఆ జ్ఞాపకాలు మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

మనం ఒక పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడుఆ అనుభవాలను స్నేహితులతో పంచుకున్నప్పుడు జ్ఞాపకాలు కలకాలం పదిలంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారుఆత్మవిశ్వాసం సన్నగిల్లిన వారితో స్నేహం చేసివారికి పాఠాలు నేర్పండని విద్యార్థులకు సూచించారుమీకన్నా తెలివైనవారితో చర్చించిమీ అవగాహనను మెరుగుపరచుకోండిఈ రెండు రకాల ప్రయోజనాల ద్వారా కొత్త ఆలోచనలు రావటమే కాకమనసు ఉత్సాహంగా ఉండిఏకాగ్రత పెరుగుతుందని ఆయన తెలిపారు.

పంజాబ్‌కు చెందిన మరో విద్యార్థి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి గౌరవప్రదంగా అభివాదం చేస్తూ, 12వ తరగతి విద్యార్థులకున్న సవాళ్ల గురించి మాట్లాడారుఒకే సమయంలో బోర్డు పరీక్షలుపోటీ పరీక్షలకు ప్రిపేర్ అవటంపరీక్షా విధానాలు వేరుగా ఉండటంఒకే సమయంలో పరీక్షల షెడ్యూల్ ఉండటం వారికి కష్టంగా ఉంటుందన్నారుఆ విద్యార్థి ఆందోళనను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి.. దీన్ని ఒకే సమయంలో క్రికెట్ఫుట్‌బాల్ ఆడటమని అభివర్ణించారువిద్యార్థులు 12వ తరగతి సిలబస్‌కే ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారుసిలబస్‌ను పూర్తిగా అవగతం చేసుకుంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకుండానే పోటీ పరీక్షలు సులభతరమవుతాయన్నారుపిల్లలు వారి సామర్థ్యంనైపుణ్యంఆసక్తి మేరకు ఎదిగేలా సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు.

మార్కులుఆటలుఆనందాన్ని సమతుల్యం చేయటం

చదువుపై శ్రద్ధ పెట్టాలని సమాజం నుంచి ఒత్తిడి ఉందనిగేమింగ్ రంగంలో భవిష్యత్తుపై ఓ విద్యార్థి ప్రశ్నించారుదానికి ప్రధానమంత్రి సమాధానమిస్తూ.. మొదట్లో తల్లిదండ్రులు నిరుత్సాహపడినాఒకసారి విజయం సాధించిన తర్వాత వాళ్లే గర్వంగా ఆ విజయాన్ని వేడుకగా జరుపుకుంటారని వివరించారుగేమింగ్ పట్ల ఆసక్తిని ఉత్పాదకత దిశగా మళ్లించాలని ఆ విద్యార్థిని ప్రోత్సహిస్తూ.. పంచతంత్రంపురాణ గాథల వంటి భారతదేశపు గొప్ప కథల ఆధారంగా కొత్త ఆటలను సృష్టించాలనివాటికి గుర్తింపు లభించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకోవాలని ఆయన సూచించారుగేమింగ్.. కేవలం కాలక్షేపం కాదనిదానికి వేగంఅప్రమత్తత వంటి నైపుణ్యాలు అవసరమనిఇది స్వీయ అభివృద్ధికి సహకరిస్తుందని వివరించారునాణ్యమైన గేమింగ్‌లో ప్రావీణ్యం సంపాదించటంపై దృష్టి సారించాలని సూచించారుగేమింగ్ పేరుతో జరుగుతున్న జూదం పట్ల హెచ్చరిస్తూఅనైతిక పద్ధతులను అరికట్టటానికి రూపొందించిన చట్టాలను గుర్తు చేస్తూగేమింగ్‌ను నిర్మాణాత్మక నైపుణ్యంగా స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించటం పట్ల విద్యార్థులు ఉత్సాహాం కనబరిచారుఆయన స్వేహపూర్వక పలకరింపువిద్యార్థుల ప్రశ్నలపై ఆయన చూపిన ఆసక్తివాటికి ఆయన అందించిన ఆలోచింపజేసే సమాధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

భయాన్ని బలంగా మార్చుకోవటం ఒత్తిడిసమయంఆత్మవిశ్వాసాన్ని సమన్వయం చేసుకోవటం

ఎగ్జామ్ వారియర్ పుస్తకం చదవటం వల్ల పరీక్షలపై తమ దృక్పథం ఎలా మారిందో విద్యార్థులు పంచుకున్నారుగతంలో పరీక్షలంటే ఒత్తిడిభయం కలిగేవనిఈ పుస్తకం చదివిన తర్వాత పరీక్షలు ఒక మిత్రుడిలా మారిపోయాయని ఓ విద్యార్థి పేర్కొన్నారుగతంలో ఇతరులతో పోల్చుకుని ఆందోళన చెందేవాళ్లమనితమ శైలి ప్రత్యేకమైనదనిప్రభావవంతమైందని ఇప్పుడు గ్రహించినట్లు మరో విద్యార్థి తెలిపారుసమయపాలన ఎప్పుడూ సవాలుగానే ఉండేదనిఎగ్జామ్ వారియర్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాకఇకపై ఉదయాన్నే నిద్రలేచి పనులను సమర్థవంతంగా నిర్వహించుకోవాలని నిశ్చయించుకున్నామని ఒక విద్యార్థి చెప్పారు.

సమయపాలనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సులభమైన పద్ధతిని సూచించారుచేయాల్సిన పనులను రాత్రి పడుకునే ముందు డైరీలో రాసుకునిమరుసటి రోజు వాటిని సరిచూసుకోవటంకొన్ని పనులు ఎందుకు పూర్తి కాలేదో విశ్లేషించుకోవాలని చెప్పారుఉత్పాదకతతో సమయాన్ని వినియోగించుకోవటం నేర్చుకుంటే ఒత్తిడిఅలసట తొలగిపోతాయని స్పష్టం చేశారుతనకు ఎన్ని బాధ్యతలున్నప్పటికీసరైన సమయపాలన పాటించే అలవాటు వల్లే ఒత్తిడి ఉండదని తెలిపారు.

గణితం వంటి సబ్జెక్టుల పట్ల తమకున్న భయం ఆసక్తిగా ఎలా మారిందో విద్యార్థులు వివరించారుఒకప్పుడు గణితం భూతంలా ఉండేది కానీఇప్పుడది ఇష్టమైన సబ్జెక్టు అని ఒక విద్యార్థి తెలిపారువేద గణితం గురించి మరింత తెలుసుకోవాలని విద్యార్థులను ప్రధానమంత్రి ప్రోత్సహించారుఇది చాలా వినోదాత్మకంగామాయాజాలంలా ఉంటుందని అభివర్ణిస్తూఇలాంటి విధానాలను స్నేహితులతో పంచుకోవటం వల్ల వారిలోనూ ఆసక్తిని కలిగించవచ్చని సూచించారు.

ఒకప్పుడు పరీక్షల తేదీలు భయాన్ని కలిగించేవని కానీపరీక్షలను పండగలా జరుపుకోవాలి అనే మంత్రం తనలో ఉత్సాహాన్ని నింపిందని మరో విద్యార్థి పంచుకున్నారుపరీక్షా పే చర్చలో నేర్చుకున్న పాఠాలను కుటుంబసభ్యులతో కూడా పంచుకోవాలనిఅవి వారికి కూడా సమాన ప్రయోజనాలను కలిగిస్తాయని ప్రధానమంత్రి సలహా ఇచ్చారు.

తక్కువ మార్కులు వస్తాయేమో అన్న భయాన్ని అధిగమించిన తీరును విద్యార్థులు గుర్తుచేసుకున్నారుమార్కులే సర్వస్వం కాదని గ్రహించారువైఫల్యాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎదిగిన తీరుని వారు ఉదహరణగా చెప్పుకున్నారుఒత్తిడి తగ్గితే మెదడు ఉల్లాసంగా మారి పాటలు పాడటంచిత్రలేఖనంకవితలు రాయటం వంటి నూతన నైపుణ్యాలను నేర్చుకోవటానికి వీలవుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఇప్పటికే సృజనాత్మక పనులను ప్రారంభించిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు.

విద్యార్థులు ప్రసంగాల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టుకోవటానికి పుస్తకాల ద్వారా లభించిన ఆత్మవిశ్వాసం సహాయపడిందిఒక సాధారణ వ్యక్తి కళ్లతో చూసిన సంఘటనను ఎంత స్పష్టంగా వివరించగలడో.. అలాగే సత్యంఅనుభవం నుంచి ఆత్మవిశ్వాసం లభిస్తుందని ప్రధానమంత్రి వివరించారువిద్యార్థులు చేసిన కృషిసాధించిన విజయ సత్యాల నుంచి ఆత్మవిశ్వాసం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

గతంలో సుదీర్ఘమైన లిటరేచర్ పేపర్లు చూసి ఆందోళన కలిగేదనిఇప్పుడు వేగంగా రాయటంచేతి రాతను మెరుగుపరుచుకోవటం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఒక విద్యార్థి పంచుకున్నారుదీనిపై స్పందించిన ప్రధానమంత్రి.. ప్రశ్నాపత్రానికి జవాబులను రాయటం ప్రారంభించే ముందు 30 సెకన్లపాటు ప్రశాంతంగా ఉండాలనిదీర్ఘంగా శ్వాస తీసుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనిజ్ఞానం లేకపోవటం వల్ల కాదు.. తొందరపాటు వల్లే పరీక్షల్లో తప్పులు జరుగుతాయని ఆయన తెలిపారుసరైన పద్ధతులుఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షల భయాన్ని జయించివిజయం సాధించగలరని అన్నారు.

గందరగోళ పరిస్థితుల మధ్య స్థిరంగా నిలబడటం

ఇంట్లో గందరగోళ పరిస్థితులుతల్లిదండ్రుల మద్దతు లేని సమయాల్లో ఎలా చదువుకోవాలని ఓ విద్యార్థి అడిగారుసరుకులతో నిండిన ఎడ్లబండిపై కూర్చొనిఓ చిన్నారి ఎంతో ఏకాగ్రతతో చదువుకుంటున్న వీడియోను ఈ సందర్బంగా ప్రధానమంత్రి గుర్తు చేశారువిజయం సాధించేందుకు సౌకర్యం ముఖ్యం కాదని స్పష్టం చేశారుబోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే చాలామందిసౌకర్యాలు లేని చిన్న గ్రామాల నుంచి వస్తారని తెలిపారుఎన్నో కష్టాలను ఎదుర్కొనిక్రికెట్ లో విజయం సాధించిన అంధులైన అమ్మాయిల స్ఫూర్తిదాయక కథను ఈ సందర్భంగా పంచుకున్నారుమనం అనుభవించే సౌకర్యాల వల్ల కాదు.. జీవన విధానాన్ని బట్టి జీవితం రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు.

అతిథుల వల్ల పరీక్షల సన్నద్ధతకు అంతరాయం కలుగుతుందని తమిళనాడుకు చెందిన విద్యార్థి అన్నారుఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి బదులిచ్చారుఅతిథుల బాల్య జ్ఞాపకాల గురించి అడిగిచర్చాంశాన్ని మార్చాలనిఇది విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించటమే కాకఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని సలహా ఇచ్చారు.

ఉన్నత లక్ష్యాలుగొప్ప కార్యాచరణ

పిల్లలు పెద్ద కలలను కంటేవాటిని నెరవేర్చుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలని లద్దాఖ్ కు చెందిన విద్యార్థి అడిగారుకలలు కనకపోవటం నేరం.. కలలకు కార్యాచరణ తోడవ్వాలని ప్రధానమంత్రి బదులిచ్చారువ్యోమగామి కావాలన్న ఆశయం నెరవేర్చుకోవాలంటే నిరంతరం చదవటంగొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను అధ్యయనం చేయటంఆ రంగంపై ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవటం ముఖ్యమని వివరించారుకలలను బహిర్గతం చేయటం వల్ల ఇతరులు హేళన చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారుతమ కలలను ఒకచోట రాసుకునిజాగ్రత్తగా భద్రపరుచుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

పెద్ద కలలను సాధించేందుకు అలవరచుకోవాల్సిన రోజువారీ అలవాట్లపై అడిగిన మరో ప్రశ్నకు స్పందిస్తూప్రధానమంత్రి ఇలా సమాధానం చెప్పారుమహనీయుల జీవిత చరిత్రలను చదవాలని సూచించారువారి జీవితంలోని కష్టాలనుమొదట్లో వారు తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవటం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుందనిఒక్కో అడుగూ ఎలా ముందుకు వేయాలో నేర్చుకోవచ్చని చెప్పారు.

ఒక విద్యార్థి హృదయం ఉప్పొంగే కవితను ప్రధానమంత్రికి అంకితమిచ్చారుఆ కవితలో ప్రధానమంత్రిని భారతదేశానికి గర్వకారణమనిమానవతా సేవకుడనిదేశ కలలను ముందుకు తీసుకెళ్తున్న గొప్ప నాయకుడని అభివర్ణించారుఆ కవితను హృదయపూర్వకంగా ప్రశంసించిన ప్రధానమంత్రిఆ విద్యార్థిని అభినందించారు.

ప్రధానమంత్రి ఉపాధ్యాయుడిగా మారినప్పుడు

స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి, 2047లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుఈ దార్శనికత ప్రయోజనాలు పొందేందుకు ఇప్పటి యువత.. 35 నుంచి 45 ఏళ్ల వయసులో జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఉంటారని చెప్పారు. 1915లో ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహాత్మాగాంధీ 1947 వరకు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారనిభగత్ సింగ్ వంటి నాయకుల త్యాగాలు స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి స్ఫూర్తినిచ్చాయని ఆయన తెలిపారుఅంతటి అద్భుతమైన స్వేచ్ఛను మనం సాధించగలిగినప్పుడుకలిసికట్టుగా కృషి చేస్తే అభివృద్ధి చెందిన భారతదేశం తప్పక సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వ్యక్తిగత అంకిత భావాన్ని లిఖితపూర్వకంగా వ్యక్తపరచాలని విద్యార్థులను ప్రధానమంత్రి కోరారుఇందులో భాగంగా వారి చేయాల్సిన ఐదు ప్రధానాంశాలను గుర్తించాలని సూచించారునైపుణ్యాభివృద్ధిఆత్మవిశ్వాసంస్వదేశీ వస్తువుల వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారుస్వదేశీ స్ఫూర్తిని అవలంబించటం ద్వారా మనసుని సిద్ధం చేసుకుంటూ వలసవాద మనస్తత్వాన్ని వీడాలని ఆయన పిలుపునిచ్చారువిదేశీ వస్తువులపై వ్యామోహం పాఠశాలల్లో ఇప్పటికీ కొనసాగుతోందన్నారురోజూ ఉపయోగించే వస్తువులను జాబితాగా రూపొందించివాటిలో విదేశీ వస్తువులను గుర్తించిఆ వస్తువుల స్థానంలో భారత ఉత్పత్తులను చేర్చటం ద్వారా ఏడాది కాలంలోనే వారి ఇళ్లు స్వదేశీ వస్తువులతో నిండిపోతుందని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారుభారతీయులుగా మన ఉత్పత్తులపై మనమే గర్వపడకపోతేప్రపంచం గౌరవించదని ఆయన తెలిపారుఆలస్యానికి "ఇండియన్ టైమ్అని సాకులు చెప్పే ధోరణిని ఆయన విమర్శించారుఇటువంటి వైఖరి దేశ గౌరవాన్ని తగ్గిస్తుందని వ్యాఖ్యానించారుపరిశుభ్రతతో ప్రారంభమయ్యే కర్తవ్య పాలనను అలవరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారుఅభివృద్ధి చెందిన దేశాలు శుభ్రంగా ఉండటానికి కారణం కేవలం పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కాదు.. అక్కడి పౌరులు బయట చెత్త వేయకపోవటం అసలు కారణమని స్పష్టం చేశారుభారతీయులు పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదనిఎవరైనా చెత్త వేసినాదాన్ని మనం తీసేయటం ద్వారా చెత్త పడేసిన వారు సిగ్గుపడేలా చేయాలని సూచించారుఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా పౌరుల ప్రాథమిక బాధ్యతనిపౌరులంతా ఇటువంటి బాధ్యతలను నెరవేరిస్తేఅభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారుభారత్ అభివృద్ధి చెందితే నేటి యువతపెద్దయ్యాక పూర్తిస్థాయిలో గొప్ప ప్రయోజనాలను అనుభవిస్తారని తెలిపారుతమకు ప్రయోజనం కలిగే పనులు చేయాలా అని ప్రధానమంత్రి ప్రశ్నించగావిద్యార్థులు అవునని బదులిచ్చారుఆ తర్వాత ప్రస్తుత తరానికిముఖ్యంగా సాంకేతిక రంగంలోని అపారమైన అవకాశాల గురించి మాట్లాడారుఅప్పట్లో అలాంటి అవకాశాలు లేవనినేటి యువత కృతిమ మేథను తెలివిగా వినియోగించుకోవాలని సూచించారుజీవిత చరిత్రలను క్షుప్తంగా తెలుసుకోవటానికి ఏఐని వాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఒక వ్యక్తి వయసుఅభిరుచులకు అనుగుణంగా ఏ జీవిత చరిత్రలు చదవాలో సిఫార్సు చేయమని ఏఐని అడిగిఆ పుస్తకాలను స్వయంగా చదవటం వల్ల నిజమైన వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని చెప్పారువినోదం మాత్రమే కాకసామర్థ్యంజ్ఞానాన్ని పెంపొందించటానికి ఏఐ సాధనంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారుఏఐ వినియోగంపై ఆయన మార్గదర్శకత్వం పట్ల విద్యార్థులు ప్రశంసలు కురిపించారుఇది వారి సాంకేతిక ప్రయత్నాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కర్ణాటక శాస్త్రీయ సంగీత శైలిలో ఓ విద్యార్థి ఇచ్చిన వేణుగాన ప్రదర్శనను ప్రధానమంత్రి ఆసక్తిగా ఆలకించిప్రశంసించారువసంతపంచమి సందర్భంగా ఉత్తరాఖండ్ సంప్రదాయ విశిష్టత తెలిసేలా స్వయంగా రూపొందించిన పుష్పగుచ్ఛం అందించిన విద్యార్థిని అభినందించారుత్రిపుర సంప్రదాయాలను తెలియజేసేలా విద్యార్థులు బహుమతిగా ఇచ్చిన సేంద్రీయ తేయాకుఅస్సామీ గమోచాను ప్రశంసించారువిద్యార్థుల్లోని సృజనాత్మకతను అభినందిస్తూకవిత్వం రాయటం కొనసాగించాలని ప్రోత్సహించారుఅందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూశుభాకాంక్షలు తెలిపారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమం రాబోయే ఎపిసోడ్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూదేశంలోని వివిధ ప్రాంతాల్లో "పరీక్షా పే చర్చనిర్వహించాలని చాలామంది విద్యార్థులు సూచించారనిఆ విషయం ఈ ఎపిసోడ్‌లో ప్రతిబింబించిదనన్నారుకుటుంబంలో తోబుట్టువుల నుంచి మంచి లక్షణాలను అలవరచుకోవాలని సూచించారుగొప్పగా ఎదగాలని ఆశించటంలో తప్పులేదు కానీఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదన్నారువ్యక్తిగతంగాసామాజికంగా విద్య ప్రాముఖ్యతను గురించి చెబుతూజీవితంలో క్రీడలు కూడా ముఖ్య భాగంగా ఉండాలని చెప్పారువిద్యార్థుల ఆలోచనలనుఅనుభవాలను స్వేచ్ఛగా పంచుకోవాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం తదుపరి ఎపిసోడ్ ఫిబ్రవరి 2026న ఉదయం 10 గంటలకు ప్రసారం అవుతుంది.


(రిలీజ్ ఐడి: 2224748) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam