వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో


రైతు ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

రైతుల ప్రయోజనాలే అత్యంత కీలకం; ప్రధాన ధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు లేదా

డెయిరీ రంగానికి ఎలాంటి ముప్పు లేదు - శ్రీ చౌహాన్

తక్కువ పన్నులతో బియ్యం, మసాలా దినుసులు, వస్త్రాల ఎగుమతులకు ఊతం;

పత్తి రైతులకు లబ్ధి - శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 5:32PM by PIB Hyderabad

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలోకేంద్ర వ్యవసాయరైతు సంక్షేమగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు కీలక ప్రకటన చేశారుఈ ఒప్పందం భారత వ్యవసాయ ప్రయోజనాలనుముఖ్యంగా వ్యవసాయంపాడి పరిశ్రమ రంగాలను పూర్తిగా రక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంమార్గదర్శకత్వంలో జరిగిన ఈ ఒప్పందం దౌత్యనీతిఅభివృద్ధిఆత్మగౌరవానికి సరికొత్త నిదర్శనమని ఆయన స్పష్టం చేశారురైతుల ప్రయోజనాల విషయంలో ప్రధానమంత్రి మొదటి నుంచీ రాజీ లేని వైఖరితో ఉన్నారని ఆయన పేర్కొన్నారుఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీ చౌహాన్భారత ప్రధాన ధాన్యాలుపండ్లుముఖ్యమైన పంటలుచిరుధాన్యాలుపాడి ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమనివీటికి ఎటువంటి ముప్పు లేదని పునరుద్ఘాటించారుచిన్నపెద్ద రైతుల ప్రయోజనాలను సంపూర్ణంగా కాపాడారనిఈ ఒప్పందం భారత వ్యవసాయ రంగానికి నష్టాలు కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు

చిన్న రైతుల ప్రయోజనాలుఅమెరికా వ్యవసాయ ఉత్పత్తుల పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనలపై వివరణ

భారతదేశంలో సగానికి పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నందునచిన్న రైతులు ఇబ్బంది పడతారనే ఆందోళనలను మంత్రి శ్రీ చౌహాన్ తోసిపుచ్చారువిదేశీ వస్తువులు భారత మార్కెట్లోకి అకస్మాత్తుగా ప్రవేశించి అలజడి సృష్టించే అవకాశం లేదని ఆయన హామీ ఇచ్చారుభారతీయ రైతులకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనిఅన్ని ప్రధాన పంటలుఆహార ధాన్యాలుపండ్లుడెయిరీ ఉత్పత్తులకు రక్షణ కల్పించామని ఆయన వివరించారు.  అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌లో ప్రవేశం పెరుగుతుందంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి చేసిన ట్వీట్ వల్ల కలిగిన గందరగోళంపై శ్రీ చౌహాన్ స్పందించారుదీనికి సంబంధించి వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇప్పటికే పార్లమెంటులో వాస్తవాలను వివరించారని ఆయన గుర్తు చేశారుస్వదేశీ రైతులపై ఒత్తిడి పడేలా భారత్ తన మార్కెట్లను ఏమాత్రం తెరవలేదనికీలకమైన వ్యవసాయ ఉత్పత్తులకు రక్షణ కవచం అలాగే ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

బియ్యంమసాలా దినుసులువస్త్ర ఎగుమతులకు ఊతం

ఈ ఒప్పందం ద్వారా లభించే ఎగుమతి అవకాశాలను ప్రస్తావిస్తూభారత్  ఇప్పటికే అమెరికాతో సహా అనేక దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తోందనిఇటీవల దాదాపు రూ. 63,000 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయని శ్రీ చౌహాన్ పేర్కొన్నారుపన్నుల తగ్గింపు వల్ల భారత బియ్యంమసాలా దినుసులువస్త్ర ఎగుమతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందనివస్త్ర ఎగుమతుల వృద్ధి లక్షలాది మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారుప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నాయనీఈ ఒప్పందం కచ్చితంగా భారతీయ రైతుల ప్రయోజనం కోసమేననిఇది కొత్త ఎగుమతి మార్గాలను తెరుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

వాణిజ్య ఒప్పందం వివరాలను పార్లమెంటులో వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూఒప్పందానికి సంబంధించిన అన్ని అంశాలను నిర్ణీత సమయంలో తెలియజేస్తామని మంత్రి పునరుద్ఘాటించారుభారతీయ రైతుల ప్రయోజనాలను సంపూర్ణంగా కాపాడాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమనిఅందులో ఎలాంటి రాజీ ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.

రైతులు అన్నదాతలువారికి సేవ చేయడం భగవంతుడిని పూజించడంతో సమానం”

వ్యవసాయ రంగం చాలా పెద్దది కావడంతోరైతుల మధ్య గందరగోళం లేదా భయం కలగకుండా స్పష్టమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని శ్రీ చౌహాన్ అన్నారు. “రైతులు మన అన్నదాతలుజీవన ప్రదాతలువారి సంక్షేమమే దేశ సంక్షేమం.వారి ప్రయోజనాలు కచ్చితంగా సురక్షితం” అని పేర్కొన్నారుమరింత భావోద్వేగంతో మాట్లాడుతూరైతులకు సేవ చేయడం దేవుని పూజతో సమానమనిమోదీ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ రైతులకు అండగా నిలుస్తుందని శ్రీ చౌహాన్ తెలిపారు

 

***


(రిలీజ్ ఐడి: 2224195) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam