విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అణు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎన్టీపీసీ ప్రణాళిక

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 1:39PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిపాలన పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ ఎన్టీపీసీకింద పేర్కొన్న రెండు మార్గాల్లో 2047 నాటికి 30 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది:

ఎన్టీపీసీభారత అణు ఇంధన కార్పొరేషన్ (ఎన్పీసీఐఎల్సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడిన అణుశక్తి విద్యుత్ నిగమ్ (అశ్విని).. రాజస్థాన్‌లోని బన్స్వరా జిల్లాలో 4×700 మెగావాట్ల సామర్థ్యంతో.. మహీ బన్స్వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు (ఎంబీఆర్ఏపీపీపేరుతో ఒక అణు విద్యుత్ ప్లాంటును నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ii. ఎన్టీపీసీ తన పూర్తి యాజమాన్యంలో ‘ఎన్టీపీసీ పరమాణు ఉర్జా నిగమ్ లిమిటెడ్ (ఎన్పీయూఎన్ఎల్అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసిందిఅవసరమైన అన్ని అనుమతులు పొందిన అనంతరం.. 2025 జనవరి 7న కంపెనీల చట్టం కింద దీనిని ఏర్పాటు చేసింది.

2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్న ప్రభుత్వ సంకల్పంలో... పైన పేర్కొన్న 30 గిగావాట్ల లక్ష్యం ఒక ముఖ్యమైన భాగం.

వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికిఅవకాశమున్న అంతర్జాతీయ భాగస్వాములతో సహకారం కోసం.. ఎన్టీపీసీ ఒక ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది.

ఎన్టీపీసీ తన జాయింట్ వెంచర్ అయిన అశ్వినీ ద్వారా రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో ‘మహి బన్స్వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్ట్ (ఎంబీఆర్ఏపీపీ)’ పేరుతో 4×700 మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోందిఎంబీఆర్ఏపీపీ మొదటి 700 మెగావాట్ల యూనిట్ తొలి పరీక్ష 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి జరుగుతుందని ప్రస్తుత అంచనాలను బట్టి తెలుస్తోంది.

లోకసభలో ఈ రోజు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ ఈ సమాచారాన్ని అందించారు.

 

****


(రిలీజ్ ఐడి: 2224122) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Tamil