పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఔషధ మొక్కలకు స్థానికత ధ్రువపత్రాల జారీకి డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 9:07AM by PIB Hyderabad

పర్యావరణంఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ద సంస్థ అయిన జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ (ఎన్‌బీఏఒక డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించిందిసాగు చేసిన ఔషధ మొక్కలను అందుబాటులోకి తీసుకురావడానికీమినహాయింపుల ప్రయోజనాలను పొందడానికీ వీలు కల్పించేలా సంబంధిత భాగస్వాములకు స్థానికత ధ్రువపత్రాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ పోర్టల్ అందిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియను చేపట్టడానికిస్థానికత ధ్రువపత్రాలను జారీ చేసే సింగిల్ విండోగాపూర్తి ఆన్‌లైన్ విధానంగా ఈ పోర్టల్ పని చేస్తుందిఈ సేవలను  https://absefiling.nbaindia.in/ ద్వారా పొందవచ్చు.

2023 జులై 25న లోక్‌సభలో, 2023 ఆగస్టు 1న రాజ్యసభలో జీవ వైవిధ్యం (సవరణచట్టం- 2023 ఆమోదం పొందింది. 2024, 2025లో ఈఎఫ్‌సీసీ మంత్రిత్వ శాఖ జీవవైవిధ్య నియమాలను నోటిఫై చేసింది.

సవరించిన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికిఆయుష్విత్తన విభాగాలుపరిశోధనా సంస్థలతో సహా సంబంధిత వర్గాల్లో విధాన అవసరాలను తీర్చడానికి జీవవైవిధ్య నియమాలను 2024, 2025లో పర్యావరణంఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.

సాగు చేసిన ఔషధ మొక్కలకు నిర్దేశిత డిజిటల్ పోర్టల్ ద్వారా స్థానికత ధ్రువపత్రాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో జారీ చేసే వెసులుబాటును సవరించిన నియమాలు అందిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2223795) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati