రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాణికుల-కేంద్రిత రైల్వే ఆధునికీకరణ, మెరుగైన భద్రత, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేలా 2026-27 కేంద్ర బడ్జెట్


హై-స్పీడ్ రైలు కారిడార్లతో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం

ఢిల్లీ-వారణాసి 3 గంటల 50 నిమిషాలు... వారణాసి-సిలిగురి 2 గంటల 55 నిమిషాలు...

చెన్నై-బెంగళూరు 1 గంట 13 నిమిషాలు... ముంబయి-పూణే 48 నిమిషాలు

యాత్రికులు, పర్యాటకుల ప్రయాణాలు, అన్ని వాతావరణ పరిస్థితుల్లో

అనుసంధానాన్ని మెరుగుపరచడానికి హిమాలయన్ రైలు విస్తరణ

మారుమూల ప్రాంతాలకూ యాక్సెస్ మెరుగుదల లక్ష్యంగా రిషికేశ్-కర్ణప్రయాగ్ లైన్, యురి విస్తరణలు

ఈశాన్య భారతంతో అన్ని ప్రాంతాల అనుసంధానానికి

40 కిలోమీటర్ల భూగర్భ రైలు కారిడార్ ప్రణాళిక

ప్రయాణికులు, సరుకుల నిరంతర రవాణాను నిర్ధారించేందుకు నాలుగు-లైన్ల విస్తరణ

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 7:31PM by PIB Hyderabad

కేంద్ర బడ్జెట్ ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి అతిపెద్ద ఊతం లభించిందికనెక్టివిటీని బలోపేతం చేయడంప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంమౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంసరుకు రవాణా వ్యవస్థలను విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిగాయిఈ నిరంతర పెట్టుబడులు సమగ్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ... రైల్వేలను దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికిలాజిస్టిక్స్ సామర్థ్యానికి కీలకంగా మార్చుతున్నాయి.

2026–27 కేంద్ర బడ్జెట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ హై-స్పీడ్ కనెక్టివిటీబహుళ రవాణా పద్ధతులువిద్యుదీకరణసురక్షిత రవాణా వంటి ప్రాధాన్యాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ సమైక్యతప్రయాణికుల సౌలభ్యంఆర్థిక అవకాశాల చోదకశక్తిగా రైల్వే పెట్టుబడుల స్థానాన్ని బలోపేతం చేసింది.

ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాలు ఢిల్లీ-వారణాసివారణాసి-సిలిగురి మధ్య కొత్త బుల్లెట్-రైలు కారిడార్ల ద్వారా మార్పునకు సిద్ధంగా ఉన్నాయివీటిని కీలకమైన ఆర్థికసాంస్కృతిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంపర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంఈ మార్గంలోని ద్వితీయ శ్రేణి నగరాలను అనుసంధానించడం లక్ష్యంగా రూపొందించారుప్రతిపాదిత వారణాసి-సిలిగురి కారిడార్ ఉత్తరప్రదేశ్బీహార్పశ్చిమ బెంగాల్‌లోని ముఖ్యమైన ఆధ్యాత్మికవిద్యావైద్య కేంద్రాలను అనుసంధానిస్తుందిఢిల్లీ-వారణాసి హై-స్పీడ్ కారిడార్ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం గంటల 50 నిమిషాలకు తగ్గిస్తుందివారణాసి నుంచి పాట్నా మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి వరకు ఉన్న హై-స్పీడ్ రైలు కారిడార్ వారణాసి-సిలిగురి మధ్య ప్రయాణ సమాయాన్ని కేవలం గంటల 55 నిమిషాలకు తగ్గిస్తుందిఈ కనెక్టివిటీ ఢిల్లీఉత్తరప్రదేశ్బీహార్పశ్చిమ బెంగాల్‌లలో విస్తరించి ఉన్న బెల్ట్‌లో నూతన ఆర్థిక కారిడార్‌ను సృష్టిస్తుందనీ... ప్రాంతీయ అభివృద్ధినిఆర్థిక కార్యకలాపాలనూ గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

తూర్పు భారతంలో సిలిగురి నుంచి వారణాసిని అనుసంధానించే తొలి హై-స్పీడ్ రైలు సేవల ద్వారా పశ్చిమ బెంగాల్ సైతం ప్రయోజనం పొందనుందిఇది అంతర్-ప్రాంతీయ రవాణాను మెరుగుపరుస్తుందివాణిజ్యసేవా అవకాశాలను విస్తరిస్తుందిఈశాన్య భారతంతో పాటు పరిసర ప్రాంతాలకు రికార్డు కేటాయింపులు కొత్త లైన్ నిర్మాణంస్టేషన్ పునరాభివృద్ధిభద్రతా మెరుగుదలకు వీలు కల్పించాయిమారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరిచాయిదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలనూ బలోపేతం చేస్తున్నాయిఈ పనులు స్థానిక వ్యాపార సంస్థలకు మద్దతునిస్తూనే... విద్యఆరోగ్య సంరక్షణపర్యాటకంఅధికారిక మార్కెట్లకూ అనుసంధానతను విస్తరిస్తున్నాయి.

ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించే 40 కిలోమీటర్ల భూగర్భ రైలు కారిడార్ ఒక కీలకమైన వ్యూహాత్మక ప్రాధాన్యం గల ప్రాజెక్ట్భూగర్భ రైల్వే ట్రాక్‌లను వేయడంఇప్పటికే ఉన్న ట్రాక్‌లను నాలుగు లైన్లుగా విస్తరించడం... అదనపు సామర్థ్యాన్ని కల్పించడం... ప్రయాణికులసరుకుల రవాణాకు ఈ కీలక రవాణా జోన్ ద్వారా నిరంతరాయంగాసమర్థమైన రైల్వే రవాణాను నిర్ధారించడం కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

పంజాబ్హర్యానాహిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 100 శాతం విద్యుదీకరణ పూర్తయిందిఈ రాష్ట్రాలు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయిరైలు భద్రతసుస్థిరతప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాయిఖనిజపారిశ్రామిక బెల్ట్‌లలోజార్ఖండ్‌లోని ప్రాజెక్టులుఛత్తీస్‌గఢ్‌లోని రౌఘాట్-జగ్దల్‌పూర్ లైన్... సరుకు రవాణా సంబంధాలనుప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేస్తున్నాయి.

దక్షిణ భారతంలో రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు స్పష్టంగా అధిక-ప్రభావం గల ప్రయాణికుల కనెక్టివిటీ దిశగా దృష్టి సారించాయిహైదరాబాద్బెంగళూరుచెన్నైపరిసర పట్టణ కేంద్రాలను అనుసంధానిస్తూ వర్ధమాన హై-స్పీడ్ రైలు మార్గం "డైమండ్ప్రాజెక్టును రూపొందించారుఈ నెట్‌వర్క్ దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక ఇంజిన్ల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందిఐటీతయారీసేవల కారిడార్లలో సౌకర్యవంతమైన రవాణానూ అనుమతిస్తుందివ్యాపార సంబంధ ప్రయాణాలుప్రతిభ సంబంధ ప్రయాణాలుఅంతర్-రాష్ట్ర ప్రయాణాలు మరింత అందుబాటులోకి రానున్న క్రమంలో భారత ప్రధాన సాంకేతిక కేంద్రంగా బెంగళూరు అత్యధికంగా లాభపడనుంది..

హై స్పీడ్ కారిడార్ పూర్తయిన తర్వాత ప్రయాణ సమయాలు... చెన్నై-బెంగళూరు కోసం సుమారు గంట 13 నిమిషాలుబెంగళూరు-హైదరాబాద్ కోసం సుమారు గంటలుచెన్నై-హైదరాబాద్ కోసం సుమారు గంటల 55 నిమిషాలకు తగ్గుతాయిఈ నెట్‌వర్క్ కర్ణాటకతెలంగాణఆంధ్రప్రదేశ్తమిళనాడుకేరళపుదుచ్చేరిలకు శక్తిమంతమైన వృద్ధిని అనేక రెట్లు పెంచడంతో పాటుగా ప్రాంతీయ అభివృద్ధినీ గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

మహారాష్ట్రకు కేటాయింపుల్లో ప్రధాన వాటా... అధిక-ప్రభావాన్ని కలిగించేసామర్థ్యాన్ని పెంపొందించే ప్రాజెక్టులపైముఖ్యంగా ముంబయి-పూణే హై-స్పీడ్ రైలు కారిడార్రద్దీగా ఉండే ట్రంక్ మార్గాల విస్తరణకీలక స్టేషన్ల ఆధునికీకరణపునరాభివృద్ధిరాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న ప్రయాణికులసరుకు రవాణా డిమాండ్‌కు మద్దతుగా సబర్బన్ఇంటర్-సిటీ రైలు సేవలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.

పశ్చిమమధ్య భారతంలో రాబోయే ముంబయి-పూణే హై-స్పీడ్ కారిడార్ ప్రయాణ సమయాన్ని దాదాపు 48 నిమిషాలకు తగ్గించడంతో పాటు రెండు ప్రధాన పట్టణ కేంద్రాలను సమర్థంగా అనుసంధానిస్తుందిపూణే నుంచి హైదరాబాద్‌కు దాదాపు గంట 55 నిమిషాల్లో చేరుకోగల వేగవంతమైన కనెక్టివిటీఅక్కడ నుంచి దక్షిణ భారత నగరాలకు అనుసంధానం వల్ల ఈ ప్రాంతాల అంతటా నిరంతరాయంగా హై-స్పీడ్ స్పైన్ ఏర్పడుతుందిప్రయాణికులకుప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకూ ప్రయోజనం చేకూరుతుంది.

హిమాలయాలుఉత్తర ప్రాంతాల్లో ఆర్థిక అనుసంధానతపర్యాటకం సహా అన్ని వాతావరణాలకు అనువైన రవాణాను పెంపొందించేలా బడ్జెట్ రూపొందించారుసంక్లిష్టమైన సొరంగాలను కలిగి ఉన్న ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్-కర్ణప్రయాగ్ లైన్ మారుమూల ప్రాంతాలకు యాక్సెస్‌ను మెరుగుపరుస్తుంది. ప్రయాణ సమయాన్నీ తగ్గిస్తుందివిద్యుదీకరణభద్రతా నవీకరణల్లో విస్తృత పెట్టుబడులతో పాటు యాత్రికులుపర్యాటకుల ప్రయాణాలకు మద్దతునిస్తుందిహిమాచల్ ప్రదేశ్ నెట్‌వర్క్ విస్తరణఆధునికీకరణవిద్యుదీకరణకు కేంద్రీకృత మద్దతు లభిస్తుందికొండ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచుతుందిజమ్మూ కాశ్మీర్‌లోని యురి మార్గంలో విస్తరణతో సహా బలోపేతం చేసిన రైలు లింకులు... శీతాకాల అంతరాయాలు ఉన్నప్పటికీ ఏడాది పొడవునా కనెక్టివిటీని నిర్ధారిస్తాయిఇది ప్రయాణికులకుస్థానిక ఆర్థిక వ్యవస్థలకూ ప్రయోజనం చేకూరుస్తుంది.

జార్ఖండ్బీహార్ఒడిశామహారాష్ట్రల మీదుగా వెళుతున్న డంకుని (పశ్చిమ బెంగాల్నుంచి సూరత్ (గుజరాత్వరకు తూర్పు-పశ్చిమ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ద్వారా సరుకు రవాణా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నారుఈ కారిడార్ వేగవంతమైనమరింత విశ్వసనీయమైన సరుకు రవాణాకు వీలు కల్పిస్తుందిప్రయాణికుల మార్గాల్లో రద్దీని తగ్గిస్తుందిలాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుందిఈ కీలక ఆర్థిక రాష్ట్రాల్లో పారిశ్రామికవాణిజ్య వృద్ధికి తోడ్పడుతుంది.

ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమాలు తక్కువ ప్రయాణ సమయంతో పాటు సురక్షితమైనమరింత సౌకర్యవంతమైన రైళ్లుఆధునికీకరించిన స్టేషన్లుతగ్గిన రద్దీచివరి ప్రాంతాలకూ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయిఅదే సమయంలో భారతీయ రైల్వేల దీర్ఘకాలిక లక్ష్యమైన 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా కోసం ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లుఆధునిక రైలింజిన్లుఅప్‌గ్రేడ్ చేసిన ట్రాక్‌లుఅధునాతన సిగ్నలింగ్ ద్వారా మద్దతు లభిస్తుందిఇది ప్రయాణికుల సేవలకు అంతరాయం కలిగించకుండా సరుకులను వేగంగా తరలించడానికి వీలు కల్పిస్తుందిరాష్ట్రాల్లో అధిక మూలధన పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుందిప్రాంతీయ అభివృద్ధిని పెంచుతుందిస్థానిక ఆర్థిక వ్యవస్థలనూ బలోపేతం చేస్తుందికేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సమన్వయంతో వికసిత్ భారత్ దార్శనికతనూ సాకారం చేసుకోవచ్చువిధాన ప్రకటన తర్వాతవివరణాత్మక ప్రణాళికఅమలుతో ఇప్పుడు ఈ దార్శనికత సాకారమవడం ప్రారంభమవుతుంది.

రాష్ట్రాల వారీగా రైల్వే బడ్జెట్ కేటాయింపు వివరాలు

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయ మార్పు నమోదైందిఈ రాష్ట్రంతో పాటు తెలంగాణ వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ. 886 కోట్లు ఉండగా 2026–27లో రూ. 10,134 కోట్లకు చేరడం ద్వారా పదకొండు రెట్లు పెరిగిందిఈ గణనీయ పెట్టుబడి రూ.92,649 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చింది.

అస్సాం ఈశాన్య ప్రాంతం: అస్సాంఈశాన్య ప్రాంతాలు గణనీయమైన రైల్వే అభివృద్ధిని సాధించాయివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.2,122 కోట్లు ఉండగా 2026–27లో రూ.11,486 కోట్లకు చేరి ఐదు రెట్లు పెరిగిందిఈ నిధులు మొత్తం రూ.72,468 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిస్తున్నాయి.

బీహార్: బీహార్ రైల్వే మౌలిక సదుపాయాల్లో పరివర్తనాత్మక విస్తరణ నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,132 కోట్ల నుంచి 2026–27లో రూ.10,379 కోట్లకు చేరి తొమ్మిది రెట్లు పెరిగిందిఈ అపూర్వ పెట్టుబడులు రూ.1,09,158 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చాయి.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయ పరివర్తనను నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.311 కోట్ల నుంచి 2026–27లో రూ.7,470 కోట్లకు చేరి ఏకంగా 24 రెట్లు పెరిగిందిఈ గణనీయ పెట్టుబడులు మొత్తం రూ.51,080 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చాయి.

ఢిల్లీ: ఢిల్లీ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయ పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.96 కోట్ల నుంచి 2026–27లో రూ.2,711 కోట్లకు చేరి ఏకంగా 28 రెట్లు పెరిగిందిఈ పెట్టుబడులు మొత్తం రూ.8,976 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చాయి.

గోవా: గోవా రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందాయి. 2026–27లో రూ.515 కోట్ల కేటాయింపులతో మొత్తం రూ.4,344 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతు లభించింది.

గుజరాత్: గుజరాత్ రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయమైన పరివర్తనను సాధించాయివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.589 కోట్ల నుంచి 2026–27లో రూ.17,366 కోట్లకు చేరి 29 రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక పెట్టుబడితో రూ.1,28,748 కోట్ల విలువైన పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

హర్యానా: హర్యానా తన రైల్వే మౌలిక సదుపాయాల్లో పరివర్తనాత్మక విస్తరణ నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.315 కోట్ల నుంచి 2026–27లో రూ.3,566 కోట్లకు చేరి 11 రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.12,091 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.108 కోట్ల నుంచి 2026–27లో రూ.2,911 కోట్లకు చేరి 27 రెట్లు పెరిగిందిఈ పెట్టుబడి మొత్తం రూ.17,711 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ రైల్వే మౌలిక సదుపాయాల్లో సుస్థిర అభివృద్ధిని సాధించిందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,044 కోట్ల నుంచి 2026–27లో రూ.1,086 కోట్లకు పెరిగిందిఈ పెట్టుబడి మొత్తం రూ.522 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిస్తుంది.

జార్ఖండ్: జార్ఖండ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో పరివర్తనాత్మక ప్రోత్సాహాన్ని పొందిందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.457 కోట్ల నుంచి 2026–27లో రూ.7,536 కోట్లకు చేరి ఏకంగా 16 రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.63,470 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

కర్నాటక: కర్నాటక రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.835 కోట్ల నుంచి 2026–27లో రూ.7,748 కోట్లకు చేరి తొమ్మిది రెట్లు పెరిగిందిఈ పెట్టుబడి మొత్తం రూ.52,950 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

కేరళ: కేరళ తన రైల్వే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులుఅభివృద్ధిలో అపూర్వ పెరుగుదల నమోదైందిరాష్ట్ర వార్షిక సగటు రైల్వే బడ్జెట్ కేటాయింపు 2009–14లో రూ.372 కోట్ల నుంచి 2026–27లో రూ.3,795 కోట్లకు చేరి దాదాపు పది రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక నిధుల ప్రోత్సాహం రూ. 18,041 కోట్ల విలువైన కొనసాగుతున్న పనులకు మద్దతునిచ్చింది.

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రైల్వే పెట్టుబడిలో పరివర్తనాత్మక మెరుగుదల నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.632 కోట్ల నుంచి 2026–27లో రూ.15,188 కోట్లకు చేరి 24 రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక కేటాయింపు మొత్తం రూ.1,18,379 కోట్లతో కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

మహారాష్ట్ర: మహారాష్ట్ర రైల్వే మౌలిక సదుపాయాల్లో చరిత్రాత్మక పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,171 కోట్ల నుంచి 2026–27లో రూ.23,926 కోట్లకు చేరి 20 రెట్లు పెరిగిందిఈ అపూర్వమైన పెట్టుబడి మొత్తం రూ.1,70,058 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

ఒడిశా: ఒడిశా రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.838 కోట్ల నుంచి 2026–27లో రూ.10,928 కోట్లకు చేరి 13 రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.90,659 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

పంజాబ్: పంజాబ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.225 కోట్ల నుంచి 2026–27లో రూ.5,673 కోట్లకు చేరి ఏకంగా 25 రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.26,382 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

రాజస్థాన్: రాజస్థాన్ రైల్వే మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.682 కోట్ల నుంచి 2026–27లో రూ.10,228 కోట్లకు చేరి 15 రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.56,863 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

తమిళనాడు: తమిళనాడు రైల్వే మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.879 కోట్ల నుంచి 2026–27లో రూ.7,611 కోట్లకు చేరి తొమ్మిది రెట్లు పెరిగిందిఈ గణనీయమైన పెట్టుబడి మొత్తం రూ.35,701 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

తెలంగాణ: తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.886 కోట్లు (ఆంధ్రప్రదేశ్ తెలంగాణనుంచి 2026–27లో రూ.5,454 కోట్లకు చేరి ఆరు రెట్లు పెరిగిందిఈ కీలక పెట్టుబడి మొత్తం రూ.47,984 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో చరిత్రాత్మక పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.1,109 కోట్ల నుంచి 2026–27లో రూ.20,012 కోట్లకు చేరి 18 రెట్లు పెరిగిందిఈ భారీ పెట్టుబడి మొత్తం రూ.92,056 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పరివర్తన నమోదైందివార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.187 కోట్ల నుంచి 2026–27లో రూ.4,769 కోట్లకు చేరి ఏకంగా 26 రెట్లు పెరిగిందిఈ పెట్టుబడి మొత్తం రూ.39,491 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చింది.

పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రైల్వే మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద పరివర్తన నమోదైంది. వార్షిక సగటు బడ్జెట్ 2009–14లో రూ.4,380 కోట్ల నుంచి 2026–27లో రూ.14,205 కోట్లకు చేరడం ద్వారా మూడు రెట్లు పెరిగిందిఈ చరిత్రాత్మక పెట్టుబడి మొత్తం రూ.92,974 కోట్ల విలువైన కొనసాగుతున్న ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది.

 

***


(రిలీజ్ ఐడి: 2223113) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Odia , Kannada , Malayalam