ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంచనా ప్రాతిపదికన పన్ను చెల్లించే ప్రవాస భారతీయులకు కనీస ప్రత్యామ్నయ పన్ను (ఎంఏటీ) నుంచి మినహాయింపు
భారతదేశంలోని డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయ వినియోగదారులకు
క్లౌడ్ సేవలందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు టాక్స్ హాలీడే
భారతదేశం నుంచి డేటా సెంటర్ సేవలు అందిస్తున్న కంపెనీ, సేవలు పొందుతున్న సంస్థకు
అనుబంధ సంస్థ అయితే, సేవా వ్యయంపై 15 శాతం సేఫ్ హార్బర్ వర్తింపు
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 12:51PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెడుతూ దేశంలో కీలకమైన మౌలిక సదుపాయాలను పెంపొందించటం, డేటా సెంటర్లలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, కీలక ప్రతిపాదన చేశారు. భారతదేశం నుంచి డేటా సెంటర్ సేవలను తీసుకుని అంతర్జాతీయ వినియోగదారులకు క్లౌడ్ సేవలందించే ఏ విదేశీ కంపెనీలకైనా 2047 వరకు టాక్స్ హాలిడే ప్రకటించాలని ఆమె ప్రతిపాదించారు. అయితే భారత సంబంధిత సంస్థ ద్వారానే భారతీయ వినియోగదారులకు సేవలు అందిచాల్సి ఉంటుంది. భారతదేశం నుంచి డేటా సెంటర్ సేవలు అందిస్తున్న కంపెనీ, సేవలు పొందుతున్న సంస్థకు అనుబంధ సంస్థ అయితే, సేవా వ్యయంపై 15 శాతం సేఫ్ హార్బర్ వర్తింపచేయాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది.
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో సమయానుకూల సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు, విదేశీ సంస్థలు బాండెడ్ గిడ్డంగుల్లో విడిభాగాలను నిల్వ చేసుకునేలా బడ్జెట్ లో సేఫ్ హార్బర్ నిబంధనను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీని ప్రకారం ఇన్‌వాయిస్ విలువపై 2 శాతం లాభ పరిమితిని నిర్ణయిస్తారు. దీనివల్ల సుమారు 0.7 శాతం పన్ను ఉంటుంది. ఇతర పోటీ దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ.
భారతదేశంలో టోల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహించటానికి, కేంద్ర ఆర్థిక మంత్రి 2026-27 బడ్జెట్‌లో చేసిన కీలక ప్రతిపాదన ప్రకారం.. బాండెడ్ జోన్‌లో ఉన్న ఏ టోల్ మాన్యుఫ్యాక్చరర్‌కైనా మూలధన వస్తువులు, యంత్రాలు లేదా టూలింగ్‌ను సరఫరా చేసే విదేశీ సంస్థలకు ఐదేళ్ల పాటు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.
నోటిఫై చేసిన పథకాల ప్రకారం భారతదేశానికి వచ్చే విదేశీ నిపుణులు ఇక్కడ ఐదేళ్ల పాటు ఉన్నప్పటికీ అంతర్జాతీయ (విదేశాల్లో సంపాదించిన దానికి) ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రతిభ గలవారు భారత్‌లో ఎక్కువకాలం పాటు పనిచేసేలా ప్రోత్సహించటమే దీని ముఖ్య ఉద్దేశం.
అంచనా ప్రాతిపదికన పన్ను చెల్లించే ప్రవాస భారతీయులకు కనీస ప్రత్యామ్నయ పన్ను (ఎంఏటీ) నుంచి మినహాయింపునివ్వాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది.
***
(రిలీజ్ ఐడి: 2221736)
సందర్శకుల సూచీ సంఖ్య : : 91
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam