ఆర్థిక మంత్రిత్వ శాఖ
వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి, రైతుల నిర్ణయాధికారాన్ని మెరుగుపరిచేందుకు, వ్యక్తిగతీకరించిన సలహాల విషయంలో మద్దతునిస్తూ నష్టభయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన 'భారత్-విస్తార్' అనే బహుభాషా ఏఐ సాధనాన్ని ప్రతిపాదించిన 2026-27 కేంద్ర బడ్జెట్
భారతదేశపు 'ఆరెంజ్ ఎకానమీ'ని ప్రోత్సహించడానికి 15,000 ఉన్నత పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏపీజీసీ) కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటు
ఉద్యోగాలు, నైపుణ్య అవసరాలపై ఏఐ, వర్ధమాన సాంకేతికతల ప్రభావాన్ని అంచనా వేయడానికి 'విద్య నుంచి ఉద్యోగం, వ్యవస్థాపతక’ అనే ఉన్నత స్థాయి స్టాండింగ్ కమిటీ ఏర్పాటును ప్రతిపాదించిన బడ్జెట్
తూర్పు భారత్‌లో డిజైన్‌కు సంబంధించిన విద్య, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక కొత్త జాతీయ డిజైన్ సంస్థ ఏర్పాటు
प्रविष्टि तिथि:
01 FEB 2026 12:59PM by PIB Hyderabad
శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, భారత శ్రేయస్సులో బలమైన భాగస్వాములుగా మార్చేందుకు వారి సామర్థ్యాన్ని పెంపొందించడం అనే 'రెండో కర్తవ్యాన్ని' సాకారం చేయడంలో వర్ధమాన సాంకేతికతలు, ఏఐ ముఖ్యమైన అంశాలని బడ్జెట్ పేర్కొంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం అనేది రైతులు, స్టెమ్ రంగంలోని మహిళలు, నైపుణ్యం పెంపొందించుకోవాలనే ఆసక్తి ఉన్న యువత- దివ్యాంగులకు కొత్త అవకాశాలను కల్పించి అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని బడ్జెట్ గుర్తించింది. ఏఐ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్, అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధి, పరిశోధన - అభివృద్ధి - ఆవిష్కరణ నిధి ద్వారా కొత్త సాంకేతికతలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వ కీలక కార్యక్రమాలను 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రధానంగా పొందుపరిచింది.
భారతదేశపు 'ఆరెంజ్ ఎకానమీ'లో వర్ధమాన సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తున్నందున 2030 నాటికి 2 మిలియన్ల మంది నిపుణులు అవసరమయ్యే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏపీజీసీ) రంగాన్ని బడ్జెట్ ప్రముఖంగా ప్రస్తావించింది. భారత 'ఆరెంజ్ ఎకానమీ'ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 15,000 ఉన్నత పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ముంబయిలోని భారత క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థకు మద్దతు ఇవ్వాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదిస్తోంది.
భారత్‌లో డిజైన్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నందున దేశంలోని తూర్పు ప్రాంతంలో డిజైన్‌కు సంబంధించిన విద్య, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక కొత్త జాతీయ డిజైన్ సంస్థను ఏర్పాటు చేయాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది.

అగ్రిస్టాక్ పోర్టల్‌లను, ఐసీఏఆర్ వ్యవసాయ పద్ధతుల ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానించే 'భారత్-విస్తార్'అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచటంతో పాటు రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. దీనితో పాటు రైతులకు వ్యక్తిగతీకరించిన సలహాలను అందించటంలో మద్దతనివ్వటం ద్వారా నష్టభయాన్ని తగ్గిస్తుంది.

ఉద్యోగాలు, నైపుణ్య అవసరాలపై ఏఐ, ఇతర వర్ధమాన సాంకేతికతల ప్రభావాన్ని అంచనా వేసేందుకు, ఈ విషయంలో తగిన చర్యలను ప్రతిపాదించడానికి ‘విద్య నుంచి ఉద్యోగం, వ్యవస్థాపతక’ అనే ఉన్నత స్థాయి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
***
(रिलीज़ आईडी: 2221698)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Assamese
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam