ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లోని ఆనందపూర్‌లో అగ్నిప్రమాదం-ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 JAN 2026 6:43PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌లోని ఆనందపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘పశ్చిమ బెంగాల్‌లోని ఆనందపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం, బాధాకరం. తమ ప్రియతమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తారు: ప్రధానమంత్రి @narendramodi’’
(रिलीज़ आईडी: 2221034)
आगंतुक पटल : 4