పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బారామతి విమానాశ్రయంలో కుప్పకూలిన విఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లియర్‌జెట్-45 విమానం వీటీ-ఎస్ఎస్ కే

प्रविष्टि तिथि: 28 JAN 2026 1:36PM by PIB Hyderabad

ఎం/ఎస్ వీఎస్ ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లియర్ జెట్-45 (రిజిస్ట్రేషన్ సంఖ్య వీటీ-ఎస్ఎస్ కే) విమానం 28 జనవరి 2026న ముంబయి- బారామతి మార్గంలో ప్రయాణిస్తుండగా బారామతి వద్ద ప్రమాదానికి గురైంది. విమానంలో ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం అయిదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానంలో ఉన్న వారందరూ ఈ ప్రమాదంలో మరణించారు.

 

సంస్థ సమాచారం:

 

· సంస్థ పేరు: ఎం/ఎస్ వీఎస్ ఆర్ వెంచర్స్. ఇదొక నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్. పర్మిట్ సంఖ్య: 07/2014.

 

· తొలిసారిగా విమానయాన నిర్వహణ అనుమతిని 21.04.2014న జారీ చేశారు.

 

· ఈ ఏఓపీని చివరిసారిగా 03.04.2023న పునరుద్ధరించారు. ఇది 20.04.2028 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

 

· విమానాల సంఖ్య: ఈ సంస్థ వద్ద మొత్తం పదిహేడు (17) విమానాలు ఉన్నాయి.

 

 

 

ఈ సంస్థ వద్ద మొత్తం ఏడు లియర్‌జెట్-45 విమానాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రమాదానికి గురైంది. అయిదు ఎంబ్రేయర్ 135బీజే విమానాలు, నాలుగు కింగ్ ఎయిర్ బీ200 విమానాలు, ఒక పిలాటస్ పీసీ-12 విమానం ఉంది.

 

· చివరిసారిగా ఫిబ్రవరి 2025లో డీజీసీఏ ఆడిట్ నిర్వహించింది. ఈ తనిఖీలో ఎటువంటి లెవల్-I (తీవ్రమైన) లోపాలు కనిపించలేదు.

 

· 14.09.2023న ఈ సంస్థకు చెందిన మరొక విమానం లియర్‌జెట్45 (రిజిస్ట్రేషన్ సంఖ్య: వీటీ-డీబీఎల్) ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంపై ప్రస్తుతం ఏఏఐబీ విచారణ చేస్తోంది.

 

26 జనవరి 2026 నాటికి విమాన వివరాలు

 

· విమాన రిజిస్టేషన్ సంఖ్య: వీటీఎస్ఎస్ కే

 

· తయారు చేసిన సంవత్సరం: 2010

 

· రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ : 27/12/2022

 

· ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ: 16/12/2021

 

· ఏఆర్ సీ జారీ చేసిన తేదీ : 10/09/2025 నుంచీ 14/09/2026 వరకు చెల్లుబాటు

 

· మొత్తం వినియోగం (టీఎస్ఎన్/సీఎస్ఎన్): విమానం ఉపయోగించిన మొత్తం సమయం 4915:48 గంటలు/ మొత్తం ల్యాండ్–టేక్ సైకిల్స్ 5867

 

· చివరి ఏఆర్ సీ తనిఖీ తర్వాత విమానం ఉపయోగించిన సమయం: 85:49 గంటలు

 

ఇంజిన్ వివరాలు

 

· ఇంజిన్ రకం: టీఎఫ్ఈ731-20బీఆర్

 

· ఎడమ వైపు ఇంజిన్ గంటలు/సైకిల్స్: 4915:48/5965

 

· కుడివైపు ఇంజిన్ గంటలు/సైకిల్స్: 4526:44/5426

 

సిబ్బంది సమాచారం

 

· ప్రధాన పైలట్ : ఏటీపీఎల్ లెసెన్సుదారుడు.

 

· అనుభవం: 15, 000 గంటల కంటే ఎక్కువ

 

· చివరిసారి వైద్య పరీక్షలు చేసిన తేదీ: 19.11.2025.... 19.05.2026 వరకు చెల్లుబాటు

 

· చివరి ఐఎఫ్ఆర్/ పీపీసీ (విమానయాన నైపుణ్యత/ పనితీరు తనిఖీ) తేదీ: 18.08.2025

 

సహా పైలట్: సీపీఎల్ లైసెన్స్ కలిగినవారు

 

· అనుభవం: సుమారు 1500 గంటలు

 

· చివరిసారి వైద్య పరీక్షలు చేసిన తేదీ: 12.07.2025.., 24.07.2026 వరకు చెల్లుబాటు

 

· చివరిసారి ఐఆర్/పీపీసీ : 22.07.2025

ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమం:

 

బారామతి ఒక నియంత్రణ లేని విమానాశ్రయం. అక్కడ బారామతిలోని విమానయాన శిక్షణ సంస్థలకు చెందిన శిక్షకులు/పైలట్లు ట్రాఫిక్ సమాచారాన్ని అందిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విధుల్లో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సంఘటనల క్రమం ఈ కింది విధంగా ఉంది:

 

· 2026 జనవరి 28న ఉదయం 08:18 గంటలకు వీటీ-ఎస్ఎస్ కే విమానం తొలిసారి బారామతి ఏటీసీని సంప్రదించింది.

 

· తర్వాత విమానం బారామతికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు వారు పూణే ఏటీసీ నియంత్రణ పరిధిని దాటిపోయినట్లు తెలిపారు. పైలట్ తన విచక్షణను ఉపయోగించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో విమానాన్ని కిందికి దించాలని సూచించారు.

 

· గాలి వేగం, దృశ్యమానత గురించి విచారించగా.. గాలి అనుకూలంగా ఉందని, దృశ్యమానత సుమారు 3000 మీటర్లు ఉందని వారికి తెలియజేశారు.

 

· తర్వాత విమానం రన్‌వే 11 లో దిగేందుకు సిద్ధం అయ్యారు. కానీ, వారికి రన్‌వే కనిపించలేదు. తొలి ప్రయత్నంగా వారు గాల్లో చక్కర్లు కొట్టాలని నిర్ణయించుకున్నారు.

 

· అంతలో... విమానం ఎక్కడున్నది అంటూ ఏటీసీ సిబ్బంది అడగ్గా.. రన్ వే11 లో దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 

· రన్‌వే కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని కోరగా, ‘‘ప్రస్తుతానికి రన్‌వే కనిపించడం లేదు, కనిపించగానే సమాచారం ఇస్తాం’’ అని పైలట్లు సమాధానమిచ్చారు. కొన్ని సెకన్ల తర్వాత రన్‌వే కనిపిస్తోందని తెలిపారు.

 

· ఉదయం 08:43 గంటలకు రన్‌వే 11పై విమానం దిగడానికి పైలట్ కు ఏటీసీ అనుమతి ఇచ్చింది. దీని తర్వాత విమానం నుంచి కమ్యూనికేషన్ ఆగిపోయింది.

 

· ఈ తర్వాత ఉదయం 08:44 గంటలకు రన్‌వే 11 మొదటి భాగంలోనే మంటలు ఎగిసిపడటాన్ని ఏటీసీ గమనించింది. వెంటనే అత్యవసర సహాయక సేవలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి.

 

· విమానం శిథిలాలు రన్‌వే 11 తొలి భాగం పక్కనే ఎడమ వైపున పడి ఉన్నాయి.

 

ఈ ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు చేపట్టింది. విచారణ నిమిత్తం ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. మరింత తాజా సమాచారాన్ని కూడా వీలువెంబడి తెలియజేస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2219737) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Kannada , Malayalam