ప్రధాన మంత్రి కార్యాలయం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 JAN 2026 8:19AM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
దేశ గౌరవం, గర్వం, గౌరవానికి ప్రతీక అయిన గణతంత్ర దినోత్సవం పౌరులందరి జీవితాల్లో కొత్త శక్తిని, నూతన ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
ఈ జాతీయ పండుగ సందర్భంగా అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలనే సమిష్టి సంకల్పం మరింత బలపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ అనేకానేక అభినందనలు. భారతీయ గర్వం, కీర్తికి ప్రతీక అయిన ఈ జాతీయ పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలి. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి మన సంకల్పం మరింత బలపడాలి.’’
(रिलीज़ आईडी: 2218885)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam