ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి ఓటరుగా నమోదవ్వడం ఒక వేడుకగా పేర్కొన్న ప్రధాని, మై-భారత్ వాలంటీర్లకు లేఖ
प्रविष्टि तिथि:
25 JAN 2026 9:18AM by PIB Hyderabad
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలోని ప్రజాస్వామ్య విలువలపై నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఈ రోజు ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడంలో భారత ఎన్నికల సంఘం చేస్తున్న కృషిని, వారి అంకితభావాన్ని ప్రధానమంత్రి కొనియాడారు.
ఓటరు భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఓటరుగా ఉండటం అనేది కేవలం ఒక రాజ్యాంగపరమైన హక్కు మాత్రమే కాదని, భారత భవిష్యత్తును తీర్చిదిద్దే కీలకమైన బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య ప్రక్రియలలో పాల్గొనాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించాలని తెలిపారు. తద్వారా అభివృద్ధి చెందిన భారత్ పునాదులను బలోపేతం చేయాలని ఆయన ప్రజలను కోరారు.
ఓటరుగా నమోదు చేసుకోవడాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని శ్రీ మోదీ అన్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటరుగా నమోదయ్యే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి మై-భారత్ వాలంటీర్లకు ఒక లేఖ రాశారు. వాలంటీర్ల చుట్టూ ఉన్న ఎవరైనా ముఖ్యంగా యువకులు తొలిసారి ఓటరుగా నమోదు చేసుకున్నప్పుడల్లా సంతోషంతో దానిని ఒక పండుగలా జరుపుకోవాలని ఆ లేఖలో కోరారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో ప్రధానమంత్రి వరుస ట్వీట్లలో ఇలా పేర్కొన్నారు.
‘‘జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు.
మన దేశ ప్రజాస్వామ్య విలువలపై మనకున్న విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి ఈ రోజు ఒక సందర్భం.
మన ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భారత ఎన్నికల సంఘంతో అనుబంధం ఉన్న వారందరికీ నా అభినందనలు.
ఓటరుగా ఉండటం అనేది కేవలం రాజ్యాంగపరమైన హక్కు మాత్రమే కాదు, భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడికి గళాన్నిచ్చే ఒక ముఖ్యమైన బాధ్యత. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో ఎల్లప్పుడూ భాగస్వాములవుతూ మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిద్దాం. తద్వారా ‘వికసిత్ భారత్’ పునాదులను మరింత బలోపేతం చేద్దాం’’
‘‘ఓటరుగా మారడం గర్వించదగ్గ సందర్భం!
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేను మై-భారత్ వాలంటీర్లకు ఒక లేఖ రాశాను. మన చుట్టూ ఉన్న ఒక యువకులు తొలిసారి ఓటరుగా నమోదు చేసుకున్నప్పుడు,.. ఆ ఆనందకరమైన సందర్భాన్ని మనం కలిసి పండుగలా జరుపుకోవాలని నేను వారిని లేఖలో కోరాను’’
***
(रिलीज़ आईडी: 2218537)
आगंतुक पटल : 2