ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అండమాన్, నికోబార్ దీవుల్లో పరాక్రమ దివస్ సందర్భంగా పీఎం ప్రసంగం

प्रविष्टि तिथि: 23 JAN 2026 6:33PM by PIB Hyderabad

నమస్కారం,

అండమాన్నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె జోషినేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ట్రస్ట్ ఛైర్మన్ బ్రిగేడియర్ ఆర్.ఎస్చికారాభారత స్వాతంత్ర్య సమరయోధులుఐఎన్ఏ అజరామరుడు లెఫ్టినెంట్ ఆర్.మాధవన్...

ఈ ప్రత్యేకమైన జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినంనేతాజీ పరాక్రమంశౌర్యం నేటికీ మనకి స్ఫూర్తినివ్వటమే కాకనేతాజీ పట్ల హృదయపూర్వక గౌరవాన్ని నింపుతోంది.

మిత్రులారా,

కొన్నేళ్లుగా పరాక్రమ దివస్ దేశ స్ఫూర్తిలో అంతర్భాగంగా మారిందిపరాక్రమ దివస్‌తో మొదలై వరుసగా జనవరి 25న ఓటర్ల దినోత్సవంజనవరి 26న గణతంత్ర దినోత్సవంజనవరి 29న బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంజనవరి 30న పూజ్య బాపూజీ వర్ధంతి వరకు గణతంత్ర దినోత్సవం వంటి పండుగను జరుపుకోవటంలో నూతన సంప్రదాయం ఏర్పడటం యాదృచ్చికంఈ సందర్భంగా మీకుదేశ ప్రజలందరికీ పరాక్రమ దివస్ శుభాకాంక్షలు.

సోదరీసోదరులారా,

పరాక్రమ దివస్ ప్రధాన వేడుకలు 2026వ సంవత్సరంలో అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్నాయిఅండమాన్నికోబార్ చరిత్ర వీరత్వంపరాక్రమంత్యాగాలతో నిండినదిసెల్యులార్ జైలులో వీర సావర్కర్ వంటి లెక్కలేనంత మంది దేశభక్తుల గాథలునేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో ఈ ప్రాంతానికున్న అనుబంధం.. ఇక్కడ నిర్వహిస్తున్న పరాక్రమ దివస్‌ను మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయిస్వేచ్ఛాకాంక్ష ఎప్పటికీ అంతం కాదనే నమ్మకానికి అండమాన్ చిహ్నంఎందరో విప్లవకారులు ఇక్కడ చిత్రహింసలకు గురయ్యారుఎందరో పోరాట యోధులు ప్రాణాలను అర్పించారుఆ ప్రాణత్యాగాలతో స్వాతంత్ర్య కాంక్ష ఆరిపోవటానికి బదులుగాపోరాట స్ఫూర్తి మరింత బలపడిందిదీంతో స్వతంత్ర భారత తొలి సూర‌్యోదయానికి సాక్షిగా అండమాన్నికోబార్ నిలిచింది. 1947 కన్నా ముందుగానే 30 డిసెంబర్ 1943న సముద్రపు అలల సాక్షిగా ఇక్కడ భారతదేశ మువ్వన్నెల జెండా రెపరెపలాడిందిఈ మహత్తర ఘట్టానికి 2018లో 75 ఏళ్లు పూర్తయినప్పుడు డిసెంబర్ 30న అండమాన్‌లోని అదే ప్రాంతంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే భాగ్యం నాకు దక్కిందిఆ సముద్ర తీరంలో జాతీయ గీతాలాపన మధ్యబలమైన గాలులకు రెపరెపలాడుతున్న ఆ త్రివర్ణ పతాకం.. ఎందరో అసంఖ్యాక స్వాతంత్ర్య సమరయోధుల కలలు నేడు నెరవేరాయని చాటి చెప్పినట్లు అనిపించింది.

సోదరీసోదరులారా,

స్వాతంత్య్రానంతరం అండమాన్నికోబార్ దీవుల అద్భుతమైన చరిత్రను భద్రపరచాల్సిందికానీఅప్పుడు అధికారంలోకి వచ్చిన వారిలో అభద్రతా భావం ఉండేదిస్వాతంత్య్ర ఘనత కేవలం ఒక్క కుటుంబానికే దక్కాలని వారు కోరుకున్నారురాజకీయ స్వార్థం వల్ల దేశ చరిత్ర నిర్లక్ష్యానికి గురైంది! అండమాన్నికోబార్ దీవులు బానిసత్వ చిహ్నంగానే మిగిలిపోయాయిస్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడి దీవులు బ్రిటిష్ అధికారుల పేర్లతోనే ఉన్నాయిఈ చారిత్రక అన్యాయానికి మనం ముగింపు పలికాంఅందువల్లే పోర్ట్ బ్లెయిర్ నేడు శ్రీ విజయ పురంగా మారిందిశ్రీ విజయ పురం అనే కొత్త పేరుకొత్త గుర్తింపు నేతాజీ విజయాన్ని సూచిస్తుందిఅదేవిధంగా ఇతర దీవుల పేర్లను కూడా స్వరాజ్ ద్వీప్షహీద్ ద్వీప్సుభాష్ ద్వీప్ అని మార్చాం. 2023 ఏటభారత సైన్యంలోని సాహస వీరులుపరమవీర చక్ర అవార్డు గ్రహీతలైన 21 మంది పేర్లను అండమాన్‌లోని 21 దీవులకు పెట్టాంఅండమాన్నికోబార్‌లో బానిసత్వానికి చిహ్నాలుగా ఉన్న పేర్లు తుడిచిపెట్టుకుపోయిస్వతంత్ర భారత నూతన నామాలు ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్నాయి.

మిత్రులారా,

భారత స్వాతంత్ర్య సంగ్రామ మహావీరుడిగానే కాకస్వతంత్ర భారత స్వప్నాన్ని సాకారం చేసే గొప్ప దార్శనికుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిలిచారుఆధునికంగా కనిపించేభారత ప్రాచీన జ్ఞానం కలిగిన ఆత్మతో కూడిన నవ భారతాన్ని ఆయన ఊహించారునేతాజీ దార్శనికతను నేటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందిమన ప్రభుత్వం ఈ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుండటం సంతోషకరంఢిల్లీలోని ఎర్రకోటలో నిర్మించిన మ్యూజియాన్ని నేతాజీకి అంకితమిచ్చాంఇండియా గేట్ వద్ద నేతాజీ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాంరిపబ్లిక్ డే పరేడ్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్ కృషిని దేశం సగర్వంగా స్మరించుకుందిసుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్‌ను ప్రారంభించాంఈ కార్యక్రమాలు నేతాజీ పట్ల గౌరవ ప్రకటనలు మాత్రమే కాదు.. యువతరానికిభవిష్యత్తులో ఉత్తేజాన్ని నింపే వనరులుమన ఆదర్శాల పట్ల గౌరవంవాటి నుంచి పొందే స్ఫూర్తి.. అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పాన్ని శక్తితోఆత్మవిశ్వాసంతో నింపుతున్నాయి.

మిత్రులారా,

బలహీనమైన దేశం లక్ష్యాలను చేరుకోవటం కష్టం. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎల్లప్పుడూ శక్తిమంతమైన దేశం కోసం కలలు కన్నారుఇవాళ 21వ శతాబ్దంలో భారత్ శక్తిమంతమైనదృఢ నిశ్చయం గల దేశంగా గుర్తింపును చాటుకుంటోందిభారతదేశానికి గాయం చేసినవారి ఇళ్లలో చొరబడి ఆపరేషన్ సింధూర్ ద్వారా వారిని మట్టుపెట్టటం మీరు చూశారునేటి భారతావనికి శక్తిని ఎలా పెంచుకోవాలోఎలా నిర్వహించాలోఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసునేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకనుగుణంగాసమర్థవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు స్వావలంబన దిశగా రక్షణ రంగాన్ని సిద్ధం చేస్తున్నాంఆయుధాల కోసం గతంలో విదేశీ దిగుమతులపైనే భారత్ ఆధారపడేదికానీ నేడు రూ.23 వేల కోట్లకు పైగా రక్షణ రంగ ఎగుమతులు జరుగుతున్నాయిభారత్‌లో తయారైన బ్రహ్మోస్ క్షిపణులు అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయిస్వదేశీ పరిజ్ఞానంతో సైన్యాన్ని ఆధునీకరించుకుంటున్నాం.

సోదరీసోదరులారా,

అభివృద్ధి చెందిన భారత్ సంకల్పం కోసం 140 కోట్ల మంది భారతీయులం కలిసికట్టుగా కృషి చేస్తున్నాంస్వావలంబన ఉద్యమంఅభివృద్ధి చెందిన భారత్ మార్గాన్ని మరింత బలోపేతం చేస్తుందిస్వదేశీ మంత్రం దీనికి శక్తినిస్తుందిఅభివృద్ధి చెందిన భారతదేశం కోసం చేసే ప్రయాణంలో పరాక్రమ దివస్ స్ఫూర్తి మనకు నిరంతరం శక్తినిస్తుందని నమ్ముతున్నానునేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

భారతమాతకు జై!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

 

***


(रिलीज़ आईडी: 2218349) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada