ప్రధాన మంత్రి కార్యాలయం
రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాల పంపిణీ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించిన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
24 JAN 2026 7:01PM by PIB Hyderabad
రోజ్‌గార్ మేళా కింద ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగ విశేషాలను పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
'యువత కోసం దేశ విదేశాల్లో సరికొత్త అవకాశాలను సృష్టించడమే మా నిరంతర ప్రయత్నం. ఈరోజు యానిమేషన్, డిజిటల్ మీడియా వంటి అనేక రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఎదుగుతోంది. ఇక్కడ మన యువ మిత్రులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి.
‘‘తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, ఆటో, ఫార్మా వంటి రంగాల్లో భారత్ ఒక శక్తి కేంద్రంగా మారుతుండటంతో.. నేడు ప్రపంచ దేశాలకు మన దేశంపై నమ్మకం పెరుగుతోంది. వీటి ద్వారా కూడా యువతకు అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయి’’
‘‘నేడు దేశంలో కొనసాగుతున్న సంస్కరణల వేగంతో కార్మికులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఈ ఊపును ఇలాగే కొనసాగించాలని నా ప్రత్యేక విన్నపం’’
(रिलीज़ आईडी: 2218343)
आगंतुक पटल : 2